Home /News /business /

RELIANCE GIVES CLARITY MEDIA REPORT ON MUKESH AMBANI RELOCATING TO LONDON WITH FAMILY SK

Mukesh Ambani: అందులో నిజం లేదు.. అంబానీ ఫ్యామిలీ ఎక్కడికీ వెళ్లదు.. రిలయన్స్ క్లారిటీ

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ

Reliance: అంబానీ ఫ్యామిలీ లండన్‌కు వెళ్లిపోతుందన్న ప్రచారంలో నిజం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. లండన్‌లోని స్టోక్ పార్క్‌ని కేవలం ప్రీమియర్ గోల్ఫ్, క్రీడా వేదిక కోసమే వినియోగిస్తామని తెలిపింది.

    భారత్‌లోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) గురించి కొన్ని రోజులుగా ఓ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన ఫ్యామిలీ త్వరలోనే లండన్‌కు ఫిష్ట్ అవుతుందని, బకింగ్‌హాంషైర్‌లో ఉన్న 300 ఎకరాల స్టోక్ పార్క్ (Stoke Park) అంబానీకి రెండో నివాసం కానుందని పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. దీని గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ జరగడంతో చాలా మంది నిజమేనని భావిస్తున్నారు. ఐతే ఈ ప్రచారంపై ఎట్టకేలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. అందులో నిజం లేదని, పూర్తిగా నిరాధారమైన వార్తలని కొట్టిపారేసింది. ముకేశ్ అంబానీ కుటుంబం ఎక్కడికీ వెళ్లడం లేదని, ఇక్కడే ఉంటుందని స్పష్టత నిచ్చింది. అంబానీ ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించింది.

    '' రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబం లండన్‌కే కాదు ప్రపంచంలో మరే చోటుకు వెళ్లడం లేదు.  లండన్‌లోని స్టోక్‌ పార్క్ ఎస్టేట్‌ను ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ ఇటీవల కొనుగోలు చేసిన వార్త నిజమే. ఈ ఎస్టేట్‌ను ప్రీమియర్‌ గోల్ఫింగ్‌ క్లబ్‌తో పాటు క్రీడా రిసార్ట్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే కొనుగోలు చేశాం.  దీని ద్వారా  మా సంస్థ కన్సూమర్ బిజినెస్ మరింతగా విస్తరిస్తుంది. భారతీయ ఆతిథ్యాన్ని అంతర్జాతీయంగా చూపించాలన్న లక్ష్యంతోనే ఎస్టేట్‌ను కొనుగోలు చేశాం.'' అని  రిలయన్స్‌ గ్రూప్‌ ప్రకటించింది.



    ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ హెచ్చరిక.. ఆ తప్పులు అస్సలు చేయొద్దని సూచన..

    కాగా,  ముకేశ్‌ అంబానీ తన కుటుంబం కోసం మరో విశాలమైన భవనాన్ని బ్రిటన్‌లో సిద్ధం చేస్తున్నారని 'మిడ్‌డే' అనే వార్తా సంస్థ పేర్కొంది. లండన్‌లో బకింగ్‌హాంషైర్‌ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని ‘స్టోక్‌ పార్క్‌’ అంబానీకి  రెండో ఇల్లుగా మారనుందని, ఈ దీపావళిని కొత్త ఇంట్లో జరుపుకోడానికి అంబానీలు వెళ్లారని పేర్కొంది.  ఈ కథనం ఆధారంగా సోషల్ మీడయాలో ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. అంబానీ ఫ్యామిలీ ఇక ఇండియాలో తక్కువగా ఉంటారని,  ఎక్కువగా  లండన్‌లోని తన కొత్త నివాసంలోనే ఉండనున్నారని ప్రచారం జరిగింది. ఐతే ఆ వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖండించి.. పుకార్లకు చెక్ పెట్టింది.

    Cooking Oil Prices: మరో శుభవార్త.. తగ్గుతున్న వంట నూనెల ధరలు.. ఎంతంటే..


    ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన  ‘యాంటిలియా’లో ప్రస్తుతం అంబానీ కుటుంబం నివసిస్తోంది. ఇకపై కూడా అక్కడే ఉంటారు. లండన్‌లోని స్టోక్ పార్క్‌ని కేవలం ప్రీమియర్ గోల్ఫ్, క్రీడా వేదిక కోసమే వినియోగిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, London, Mukesh Ambani, Reliance, Reliance Industries

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు