Home /News /business /

RELIANCE GENERAL INSURANCE COMPANY LAUNCHED RELIANCE HEALTH GAIN HEALTH INSURANCE POLICY WITH UP TO RS 1 CRORE COVERAGE SS

Health Insurance: కోటి రూపాయల కవరేజీతో హెల్త్ ఇన్స్యూరెన్స్... రిలయన్స్ హెల్త్ గెయిన్ ప్రత్యేకతలివే

Health Insurance: కోటి రూపాయల కవరేజీతో హెల్త్ ఇన్స్యూరెన్స్... రిలయన్స్ హెల్త్ గెయిన్ ప్రత్యేకతలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance: కోటి రూపాయల కవరేజీతో హెల్త్ ఇన్స్యూరెన్స్... రిలయన్స్ హెల్త్ గెయిన్ ప్రత్యేకతలివే (ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance | హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఏకంగా కోటి రూపాయల వరకు కవరేజీతో హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించింది రిలయన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. రిలయన్స్ హెల్త్ గెయిన్ (Reliance Health Gain) పేరుతో కొత్త పాలసీని ప్రకటించింది.

ఇంకా చదవండి ...
భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన రిలయన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (RGICL) సరికొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని (Health Insurance Policy) ప్రకటించింది. రిలయన్స్ హెల్త్ గెయిన్ (Reliance Health Gain) పేరుతో ఆరోగ్య బీమా ప్లాన్‌ను ప్రకటించింది. ఇది "అత్యంత అనువైన, కస్టమర్లు తమకు కావాల్సినట్టు మార్చుకునే అవకాశం ఉన్న హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ" అని కంపెనీ చెబుతోంది. ఈ పాలసీలో ప్రత్యేకత ఏంటంటే కస్టమర్లు వారి అవసరానికి అనుగుణంగా ఫీచర్లను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ఫీచర్స్‌కి మాత్రమే డబ్బులు చెల్లించొచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కవరేజీ ఎంచుకునే అవకాశం ఉంది. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారెవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.

రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీ ద్వారా ప్లస్, పవర్, ప్రైమ్ పేరుతో మూడు వేర్వేరు ప్లాన్స్ అందిస్తోందని ప్రతి కస్టమర్ కోసం పాలసీ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందని, దీంతో రిలయన్స్ జనరల్ అన్ని వయస్సులు, వర్గాల వైద్య అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుందని రిలయన్స్ జనరల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

Bank Account: ఖాతాదారులకు అలర్ట్... ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి మే 29 నుంచి కొత్త రూల్స్

రిలయన్స్ హెల్త్ గెయిన్ బెనిఫిట్స్


రిలయన్స్ హెల్త్ గెయిన్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ వివరాలు చూస్తే ఇందులో 38 రకాల ఫీచర్స్ ఉంటాయి. సమ్ ఇన్స్యూర్డ్ కన్నా రెండు రెట్లు కవరేజీ పొందే అవకాశం ఉంది. పాలసీ సంవత్సరంలో ఎన్నిసార్లు క్లెయిమ్ చేసుకున్నా రీస్టోరే చేసుకోవచ్చు. గ్యారెంటీడ్ క్యుములేటివ్ బోనస్ లభిస్తుంది. క్లెయిమ్ తర్వాత కూడా బోనస్ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ప్రీఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే ముందుగానే ఏవైనా వ్యాధులు ఉంటే మూడేళ్లు, రెండేళ్లు లేదా ఒక ఏడాది కూడా వెయింటింగ్ పీరియడ్ ఎంచుకోవచ్చు. రూ.3,00,000 లోపు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి వయస్సు పరిమితి ఏమీ లేదు. కాబట్టి ఆరోగ్య బీమా లేని వృద్ధులు రక్షణ కోసం హెల్త్ గెయిన్ ఎంచుకోవచ్చు.

New Rules: ప్రజలకు అలర్ట్... జూన్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

ఇక ఈ పాలసీలో మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే మొత్తం 12 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాలసీలో చేర్చొచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామల్ని ఒకే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో యాడ్ చేయొచ్చు. కుటుంబం మొత్తానికి ఒకే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

రిలయన్స్ హెల్త్ గెయిన్ డిస్కౌంట్ ఆఫర్


రిలయన్స్ హెల్త్ గెయిన్ పాలసీపై డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఆరోగ్యవంతులకు డిస్కౌంట్ ఇస్తోంది కంపెనీ. ఎలాంటి ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీస్ లేనివారు రెండుమూడేళ్ల పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మహిళలు తమ పేరు మీద పాలసీ తీసుకొని, ఆడపిల్లల పేర్లు కూడా యాడ్ చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Health Insurance, Insurance, Reliance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు