Sports Business Summit: క్రీడల ప్రోత్సాహంలో కొత్త శకం ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్...

ప్రతి చిన్నారి త‌న ప్రతిభను ఒక వేదిక ద్వారా సాన‌బెట్టుకోడానికి మంచి అవకాశం కల్పించడంలో అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీలో స‌భ్యురాలు కూడా అయిన నీతా అంబానీ విజయం సాధించారనే చెప్పవచ్చు.

news18-telugu
Updated: October 9, 2019, 1:18 PM IST
Sports Business Summit: క్రీడల ప్రోత్సాహంలో కొత్త శకం ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్...
నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్
news18-telugu
Updated: October 9, 2019, 1:18 PM IST
రిలయన్స్‌ ఫౌండేషన్‌ యువతీ యువకుల కోసం దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పటికే రిలయన్స్ తరపున ఐపీఎల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో తనదైన ముద్ర వేయడంలో చైర్ పర్సన్ నీతా అంబానీ కృషి చేస్తున్నారు. ప్రతి చిన్నారి త‌న ప్రతిభను ఒక వేదిక ద్వారా సాన‌బెట్టుకోడానికి మంచి అవకాశం కల్పించడంలో అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీలో స‌భ్యురాలు కూడా అయిన నీతా అంబానీ విజయం సాధించారనే చెప్పవచ్చు. అంతేకాదు ఖేలో ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అనుగుణంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేపట్టిన పోటీ కార్యక్రమాలు ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. ఇందులో వివిధ క్రీడల్లో ప్రతిభావంతుల్ని గుర్తించి, వారికి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ లు అందిస్తుంది. దీని నిమిత్తం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆరుగురు సభ్యుతో సలహా మండలి ఏర్పాటు చేసింది. దీనిలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీతో పాటు సచిన్‌ టెండూల్కర్ , లియాండర్‌పేస్‌, సైనా నెహ్వాల్‌ వంటి దిగ్గజాలున్నారు. అంతేకాదు

నీతా అంబానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబయి ఇండియన్స్ జట్టుకు సహ యజమానురాలిగా వ్యవహరిస్తున్నారు. అలాగే హీరో ఇండియన్ సూపర్ లీగ్ కు ఆమె నేతృత్వం వహిస్తున్నారు. 2026 ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో భారత్ అర్హత సాధించడమే లక్ష్యంగా నీతా పనిచేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో 2016లో నీతా అంబానీకి సభ్యత్వం లభించింది. భారత్ నుంచి అలా సభ్యత్వం సాధించిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించడం విశేషం.



First published: October 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...