RELIANCE FOUNDATION REACHES OUT TO FAMILIES OF PULWAMA CRPF MARTYRS BA
పుల్వామా బాధిత కుటుంబాల బాధ్యత తీసుకుంటాం.. రిలయన్స్ ఫౌండేషన్ ఆపన్న హస్తం
రిలయన్స్ ఫౌండేషన్
Pulwama Attack.. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ్యత తీసుకుంటామని రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఆ కుటుంబంలోని పిల్లల చదువులు, వారి ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
రిలయన్స్ ఫౌండేషన్. ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉండే సంస్థ. అలాంటి సంస్థ ఇప్పుడు మరోసారి ముందుకొచ్చింది. ఈసారి పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది. ఆ కుటుంబంలోని పిల్లల చదువులు, వారి ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆ ఫ్యామిలీలు జీవనోపాధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంతటితోనే తాము ఆగిపోబోమని, రిలయన్స్ ఫౌండేషన్ సహకారం ఎక్కడ అవసరం అని ప్రభుత్వం భావిస్తే, తాము అక్కడ సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించింది.
రిలయన్స్ ఫౌండేషన్
ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాది అదిల్ అహ్మద్ ధర్ జరిపిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 49 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైన్యానికి, ప్రభుత్వానికి తమ సాయం అవసరమైనప్పుడు వారికి సహకారం అందిస్తామని ప్రకటించింది. గాయపడిన జవాన్లకు తమ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
నీతా అంబానీ, ముకేశ్ అంబానీ (ఫైల్ ఫొటోలు)
దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. సామాజిక సేవలో కూడా ముందుంది. రిలయన్స్ ఫౌండేషన్ పేరుతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్‌కు నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, విద్య, ఆరోగ్యం, క్రీడలు, కళలు, సంస్కృతి, వారసత్వం సంపదను కాపాడుకోవడం వంటి పలు భిన్న అంశాల్లో సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 2కోట్ల మందికి రిలయన్స్ ఫౌండేషన్ సహకారం అందించింది.
పది రూపాయల చీర కోసం ఎగబడిన మహిళలు.. తొక్కిసలాట
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.