Home /News /business /

RELIANCE FOUNDATION PROVIDES 2 5 LAKH COVID 19 VACCINE DOSES FREE TO THE KERALA GOVERNMENT NS

Reliance Foundation: కరోనాపై పోరులో కేరళాకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. 2.50 లక్షల వ్యాక్సిన్ డోసులు అందజేత

కేరళా సీఎం విజయన్ తో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు

కేరళా సీఎం విజయన్ తో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు

కరోనాపై కేరళ రాష్ట్రం సాగిస్తున్న పోరాటానికి రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఉచితంగా 2.5 లక్షల వ్యాక్సిన్ డోసులను అందించింది.

    కరోనాపై భారత్ సాగిస్తున్న పోరాటానికి మహమ్మారి ప్రారంభం నుంచి రిలయన్స్ ఫౌండేషన్ మొదటి నుంచి అండగా నిలిచింది. ఫౌండేషన్ చైర్‌ పర్సన్ నీతా అంబానీ నాయకత్వంలో టెస్టింగ్ మరియు ట్రీట్మెంట్ కోసం మాత్రమే కాకుండా ఆక్సిజన్ అందించడానికి కూడా విస్తృతమైన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఒకానొక సమయంలో ప్రతిరోజూ ఒక మిలియన్ మందికి ఆక్సిజన్ అందించే ఖర్చును ఫౌండేషన్ భరించింది. కోవిడ్ చికిత్స కోసం వివిధ కేంద్రాల్లో రెండు వేల పడకలు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఏడున్నర కోట్ల మందికి ఆహారం అందించబడింది. ఫౌండేషన్ దేశంలో కోటికి పైగా మాస్క్‌లను పంపిణీ చేసింది. తాజాగా కేరళా రాష్ట్రానికి భారీ సాయాన్ని ప్రకటించింది రిలయన్స్ ఫౌండేషన్. 2.25 లలక్షల కరోనా వ్యాక్సిన్ డోస్ లను ఆ రాష్ట్రానికి ఉచితంగా అందించింది. రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఇటీవల అందించారు. దీంతో పనిరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ సాయం రాష్ట్రంలో సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
    Reliance Digital India Sale: అదిరిపోయే ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ప్రారంభం

    ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ మాట్లాుడుతూ.. కరోనాపో దేశం సాగిస్తున్న పోరాటంలో తాము ప్రతి దశలో మద్దుతుగా నిలిచామన్నారు. కరోనాను ఎదుక్కోవడానికి మాస్ వాక్సినేషన్ మంచి మార్గమన్నారు. దేశంలో ఉచితంగా వ్యాక్సిన్ అందించడానికి మిషన్ వ్యాక్సిన్ సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా కేరళ రాష్ట్రానికి 2.5 లక్షల వ్యాక్సిన్ డోసులను అందించినట్లు వివరించారు. వ్యాక్సిన్ డోసులను నిన్న కొచ్చికి చేరుకున్నాయి. ఎర్నాకులం జిల్లా కలెక్టర్ జాఫర్ మాలిక్ ప్రభుత్వం తరఫున ఈ వ్యాక్సిన్ డోసులను స్వీకరించారు. ఈ వ్యాక్సిన్ కేరళా ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు అందించనున్నారు.

    అధికారులకు వ్యాక్సిన్ డోసులను అప్పగిస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు


    ఈ కరోనా సమయంలో మాత్రమే కాకుండా.. అనేక సమయల్లోనూ కేరళాకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. 2018 వరదల సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ రూ .21 కోట్లను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి బదిలీ చేసింది. అదనంగా, రూ .50 కోట్ల విలువైన బట్టలు, ఆహార పదార్థాలు మరియు మందులు రాష్ట్రానికి అందజేసింది. 2019 వరదల సమయంలోనూ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి రిలయన్స్ రూ .5 కోట్లు అందించింది.

    ఉద్యోగుల కోసం 10 లక్షల డోస్ లు..
    మిషన్ సురక్ష కార్యక్రమంలో భాగంగా 10 లక్షల వ్యాక్సిన్ డోసులను రిలయన్స్ తన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా అందించింది. ఇప్పటి వరకు దాదాపు 98 శాతం ఉద్యోగులు మొదటి డోస్ వ్యాక్సిన్ అందుకున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: COVID-19 vaccine, Kerala, Nita Ambani, Pinarayi Vijayan, Reliance Foundation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు