హోమ్ /వార్తలు /బిజినెస్ /

Women Connect Challenge India: ‘విమెన్ కనెక్ట్ చాలెంజ్’ ఇండియా గ్రాంటీలను ప్రకటించిన రిలయన్స్ ఫౌండేషన్

Women Connect Challenge India: ‘విమెన్ కనెక్ట్ చాలెంజ్’ ఇండియా గ్రాంటీలను ప్రకటించిన రిలయన్స్ ఫౌండేషన్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

లింగపరంగా డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు వినూత్న పరిష్కారాలను గుర్తించడంలో తోడ్పడేందుకు సంయుక్త కార్యక్రమం ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఎయిడ్, 17 రాష్ట్రాల్లో పని చేయనున్న గ్రాంటీలు, 3 లక్షల మంది మహిళలు, బాలికలను చేరుకోనున్నారు. ‘విమెన్ కనెక్ట్ చాలెంజ్’ ఇండియా కార్యక్రమానికి రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్లు ($ 1.1 మిలియన్ డాలర్లకు పైగా మొత్తం) సమకూర్చనుంది.

ఇంకా చదవండి ...

Women Connect Challenge India: ‘విమెన్ కనెక్ట్ చాలెంజ్’ ఇండియా ద్వారా భారతదేశవ్యాప్తంగా మొత్తం పది సంస్థలు గ్రాంటీలు (మంజూరుకర్తలు) గా ఎంపిక చేయబడ్డాయి. రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిడ్ (USAID) కలసి విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియాను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా రూ. 11 కోట్ల (1. 5 మిలియన్ డాలర్లకు పైబడిన మొత్తం)ను లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొ లగించేందుకు ఉపయోగించనున్నారు. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్ల మేరకు ($ 1.1 మిలియన్ డాలర్లకు పైగా మొత్తం) సమకూర్చనుంది. లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు వివిధ వినూత్న పరిష్కారాలను రూపొందించే ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. 17 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇది సాంకేతికత ద్వారా మహిళల ఆర్థిక సాధికారికతను అధికం చేయనుంది.

ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్ శ్రీమతి నీతా ఎం అంబానీ మాట్లాడుతూ, ‘‘ప్రతీ జీవనశైలిలో మహిళలను సంసిద్దులను చేసి, వారికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం. మేం జియో ను ప్రారంభించినప్పుడు, సమాన అవకాశాలు కల్పించే విప్లవం గురించి మేం కల కన్నాం. జియో ద్వారా మేం మన దేశవ్యాప్తంగా అందుబాటు ధరలకే అనుసంధానతను అందించగలగుతున్నాం. భారతదేశంలో లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు యూఎస్ ఎయిడ్ తో కలసి రిలయన్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. అసమానతలను పరిష్కరించేందుకు, వాటిని తొలగించేందుకు సాంకేతికత అనేది ఒక శక్తివంత మైన ఆయుధం. విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా విజేతలుగా నిలిచిన పది సంస్థలకు నా అభినంద నలు, ఈ పరివర్తన ప్రయాణంలో కలసి పని చేసేందుకు వాటిని ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.

నీతా అంబానీ సందేశం

అనుదీప్ ఫౌండేషన్, బేర్ ఫూట్ కాలేజ్ ఇంటర్నేషనల్, సెంటర్ ఫర్ యూత్ అండ్ అండ్ సోషల్ డెవలప్ మెంట్, ఫ్రెండ్స్ ఆఫ్ విమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, నాంది ఫౌండేషన్, ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్ మెంట్ యాక్షన్, సొసైటీ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్, సాలిడారిడాడ్ రీజనల్ ఎక్స్ పర్టయిజ్ సెంటర్, టీఎన్ఎస్ ఇండియా ఫౌండేషన్, జెడ్ఎంక్యూ డెవలప్ మెంట్ ఈ సంస్థల్లో ఉన్నాయి. మహిళా రైతులు, ఆంత్రప్రె న్యూర్లు, స్వయం సహాయక బృందాల సభ్యుల సమస్యలను, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగ మించేందుకు, లింగ ఆధారిత డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు ఈ పరిష్కారాలు తోడ్పడుతాయి.

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి నీతా అంబానీ..

విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా 2020 ఆగస్టులో ప్రారంభించబడింది. 180 కి పైగా వచ్చిన దరఖాస్తుల నుంచి 10 సంస్థలు ఎంపిక చేయబడ్డాయి. వీటికి ఒక్కో దానికి 12 నుంచి 15 నెలల కాలానికి రూ.75 ల క్షలు మొదలు రూ. కోటి ($100,000 - $135,000) దాకా గ్రాంటు గా లభించనుంది. 2021 జనవరిలో యూఎస్ ఎయిడ్, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా సాల్వర్స్ సింపోజియంను నిర్వహించాయి. సెమీ-ఫైనలిస్టులను, సంబంధిత రంగాల నిపుణులను ఒకే వేదికపైకి చేర్చాయి. లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు మేధోమథనం నిర్వహించాయి.

ఏడాదికేడాది మహిళల్లో మొబైల్ ఇంటర్నెట్ అవగాహన అధికమవుతోంది. 2017లో భారతదేశంలో కేవలం 19% మందికి మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ గురించి తెలుసు. 2020లో ఇది 53 శాతానికి పెరిగింది. యాజమాన్యపరంగా చూస్తే, 79% పురుషులకు గాను 67% మంది మహిళలు సొంతంగా మొబైల్ ఫోన్ ను కలిగిఉన్నారు. ఇన్నేళ్లుగా రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు డిజిటల్ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో కొనసాగాయి. రిలయన్స్ జియో ద్వారా 1.3 బిలియన్లకు పైగా భారతీయులు దేశవ్యాప్త డిజిటల్ విప్లవంలో భాగస్వాములయ్యారు, తమ జీవితాలను మార్చుకున్నారు. నేడు జియో 120 మిలియన్ల మ హిళా జియో వినియోగదారులతో, భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ సేవల కంపెనీగా ఉంది. డిజిటల్ అంత రాన్ని తొలగించేలా ఈ సంఖ్య శరవేగంగా వృద్ధి చెందుతూనే ఉంది.

విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా అనేది సాంకేతికతను మహిళలు యాక్సెస్ చేయడం, ఉపయోగించే విధానాలను అర్థవంతంగా మార్చడం ద్వారా రోజువారీ జీవితంలో మహిళలు పాల్గొనడాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన పరిష్కారాల కోసం ఓ పిలుపు లాంటిది. లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించే నూత న విధానాల్లో భారతదేశంలో రిలయన్స్ ఫౌండేషన్ తో యూఎస్ ఎయిడ్ భాగస్వామిగా మారింది. ఈ నూత నంగా గ్రాంటు పొందిన సంస్థలు మహిళల ఆర్థిక సాధికారికతను అధికం చేసేందుకు గతంలో నిర్వహించిన విమెన్ కనెక్ట్ రౌండ్స్ నుంచి స్ఫూర్తి పొందిన నిరూపిత వ్యూహాల అమలుపై దృష్టి పెట్టనున్నాయి.

రిలయన్స్ ఫౌండేషన్ గురించి:

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాతృత్వ విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ దేశం ఎదుర్కొనే అభివృద్ధిపరమైన సవాళ్ళను, వినూత్న, సుస్థిరదాయక పరిష్కారాల ద్వారా పరిష్కరించడంలో ఉత్ర్పేరకంగా పని చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ శ్రీమతి నీతా అంబానీ సారథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ (ఆర్ఎఫ్) అందరికీ అధిక నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు, అందరి సంక్షేమం కోసం అవసరమైన పరివర్తన మార్పుల్ని స మకూర్చే దిశగా పని చేస్తోంది. భారతదేశ అతిపెద్ద సామాజిక కార్యక్రమాల్లో ఒకటైన ఆర్ఎఫ్ గ్రామీణ పరివర్తన, చ దువు, ఆరోగ్యం, క్రీడలు, విపత్తుల నిర్వహణ, అర్బన్ రెన్యువల్ అండ్ ఆర్ట్స్, సంస్కృతి, వారసత్వం మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆర్ఎఫ్ ఇప్పటి వరకూ భారతదేశవ్యాప్తంగా 44,700కు పైగా పల్లెలు, పలు పట్టణ ప్రాంతాల్లో 51 మిలియన్ల మంది జీవితాలను సృజించింది.

మరిన్ని వివరాల కోసం: www.reliancefoundation.org

యూఎస్ ఎయిడ్ (USAID) గురించి:

యూఎస్ ఎయిడ్ అనేది ప్రపంచ ప్రీమియర్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ. అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడంలో ఉత్ర్పేరకంగా పని చేసే సంస్థ. జీవితాలను ఉన్నతీకరించేందుకు, కమ్యూనిటీలను నిర్మించేందుకు, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు, ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారికత కోసం కృషి చేసేందుకు ఇది పనిచేస్తోంది. యూఎస్ ఎయిడ్ కార్యాచరణ యూఎస్ జాతీయభద్రతను, ఆర్థిక సౌభాగ్యాన్నిముందుకు తీసుకెళ్తోంది. అమెరికా ఉదారతను చాటుతుంది. అభివృద్ధి ప్రయాణంలో దేశాలు ప్రగతి సాధించేందుకు తోడ్పడుతుంది. ఇప్పటి వరకూ యూఎస్ ఎయిడ్ 16 విమెన్ కనెక్ట్ చాలెంజ్ గ్రాంటీస్ ను మూడు వేర్వేరు రౌండ్స్ లో నిర్వహించింది. 16 దేశాల్లో 60 లక్షల మంది మహిళలను వారు సాంకేతికతను యాక్సెస్ చేసేందుకు వీలు కల్పించింది. 2018లో విమెన్ కనెక్ట్ రౌండ్ నిర్వహించింది. తొమ్మిది గ్రాంట్లను మంజూరు చేసింది. విమెన్ కనెక్ట్ రెండో రౌండ్ 2019లో జరిగింది. మూడు గ్రాంట్లను మంజూరు చేసింది. విమెన్ కనెక్ట్ మూడో రౌండ్ కు సంబంధించి ఈ ఏడాది మొదట్లో నలుగురు విజేతలను ప్రకటించింది.

First published:

Tags: Reliance Foundation

ఉత్తమ కథలు