కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ విస్తృతంగా బాధితులకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఆక్సీజన్ కొరతను అధిగమించడానికి రిలయన్స్ ఉచితంగా ఆక్సీజన్ తయరు చేసి పలు రాష్ట్రాలకు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఇంకా అనేక కరోనా సహాయక చర్యల్లో రిలయన్స్ తన సేవలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఉత్తరఖండ్ ప్రభుత్వానికి కరోనా సహాయ చర్యల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఉత్తరఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఆ మొత్తన్ని అందించింది. కరోనా సహాయ చర్యల నిమిత్తం ఈ సహాయాన్ని అందించినట్లు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కు రిలయన్స్ ఫౌండేషన్ లేఖ రాసింది.
ఇదిలా ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనా బాధితుల కోసం ఆక్సీజన్ తయారు చేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మొదలు పెట్టి సరఫరాకు చర్యలు ప్రారంభించింది. వాస్తవానికి రిలయన్స్ సంస్థ మెడికల్ ఆక్సీజన్ తయారీదారు కాదు. కానీ కరోనా విపత్తు నుంచి ప్రజలను కాపాడాలన్న లక్ష్యంతో ఆక్సీజన్ తయారు చేయడాన్ని సంస్థ ప్రాంభించింది. అతి కొద్ది రోజుల్లోనే సంస్థ 0 నుంచి 1000 MT మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను తయారు చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు భారత దేశంలో వినియోగిస్తున్న ఆక్సీజన్లో అత్యధికంగా 11 శాతం రిలయన్స్ సంస్థ నుంచి తయారు చేసిందే కావడం విశేషం. పది మందికి ఆక్సీజన్ అందిస్తే సరాసరిన అందులో ఒకరికి రిలయన్స్ ద్వారా తయారు చేసిందే అందించడం మరో విశేషం.
సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ స్వయంగా ఈ ఆక్సీజన్ తయారీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆక్సీజన్ ను తయారు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా అవసరం ఉన్న ప్రదేశాలకు సరఫరా చేయడామే లక్ష్యంగా ఆయన సారథ్యంలోని బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. రిలయన్స్ లో ఉత్పత్తి చేయబడిన ఆక్సీజన్ ను వివిధ రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. తద్వారా నిత్యం దాదాపు లక్ష మంది రోగులకు ఉపశమనం కలుగుతోంది. దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన గతేడాది మేలో రిలయన్స్ దేశ వ్యాప్తంగా 55,000 MT మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను దేశ వ్యాప్తంగా సరఫరా చేసింది. ఆక్సీజన్ తయారు చేయడంతో పాటు సరఫరా చేయడం కూడా క్లిష్టమైన పని. వివిధ ప్రాంతాలకు ఆక్సీజన్ ను సరఫరా చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉపయోగించుకుంటోంది. రైలు, రోడ్డు, వాయు రవాణా మార్గాల ద్వారా ఆక్సీజన్ ను తరలిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Reliance, Reliance Foundation