రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) మరో సారి తన గొప్ప మనస్సు చాటింది. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచింది. ఇటీవల వరదలతో అల్లాడుతున్న అస్సాంలోని (Assam) బాధితులకు సాయం చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 కోట్ల సహాయాన్ని ప్రకటించింది రిలయన్స్ ఫౌండేషన్. దీంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోషల్ మీడియా ద్వారా తన కృతజ్ఞతలు తెలిపారు. అస్సాం రాష్ట్రానికి అండగా నిలిచిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani), అనంత్ అంబానీలకు ధన్యవాదాలు తెలిపారు. గత నెల రోజులుగా, రిలయన్స్ గ్రూప్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇతర సామాజిక సంస్థల సహకారంతో అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తోంది. వరదల గురించి రిలయన్స్ గ్రూప్‌కు సమాచారం అందిన వెంటనే, అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య కమిషన్, వెటర్నరీ డిపార్ట్మెంట్, జిల్లా పరిపాలనలు మరియు ఇతర ప్రజా సంఘాలు సహాయాన్ని అందించడం కొనసాగించాయి.
రిలయన్స్ గ్రూప్ కచ్చర్ జిల్లాలోని సిల్చార్, కలిన్, బోర్గోలా మరియు కడిగోరా ప్రాంతాలలో మరియు నాగోవన్ జిల్లాలోని కతియాథోలి, రహా, నగోవన్ సర్దార్ మరియు కంపూర్ జిల్లాలలో రెస్క్యూ మరియు సహాయ కార్యకలాపాలను నిర్వహించింది. మొదట సుమారు 1,900 మంది ప్రజలు మరియు 10,400 పశువులకు ఆరోగ్య కేంద్రాలలో చికిత్స అందించారు.
Assam Floods : ఏటేటా ఏడవాల్సిందేనా? అస్సాం వరద విలయానికి కారణాలు? దు:ఖదాయిని బ్రహ్మపుత్ర!
My deepest gratitude to Shri Mukesh Ambani & Shri Anant Ambani for standing with the people of Assam at this crucial juncture by donating Rs 25 cr to CM Relief Fund.
We appreciate this kind gesture. This will go a long way in augmenting our flood relief measures.
— Himanta Biswa Sarma (@himantabiswa) June 24, 2022
బాధిత కుటుంబాలకు వైద్య సహాయంతో పాటు రేషన్ కూడా పంపిణీ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 5 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత ఏడాది అస్సాంలో ఎనిమిది భారీ వర్షాల సమయంలో రిలయన్స్ గ్రూప్ సుమారు 1.7 లక్షల మందికి సహాయం చేసిందని నివేదిక పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assam, Hima, Mukesh Ambani, Nita Ambani, Reliance Foundation