Sports Business Summit : మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు...నీతా అంబానీ

స్త్రీల స్వశక్తీకరణకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ముఖ్యంగా మహిళల సాధికారతపై తన అభిప్రాయాలు బలంగా ఉన్నాయని, మహిళలను అన్ని రంగాల్లో రాణిస్తున్నారని నీతా అంబానీ తెలిపారు.

news18-telugu
Updated: October 8, 2019, 7:52 PM IST
Sports Business Summit : మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు...నీతా అంబానీ
నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్
news18-telugu
Updated: October 8, 2019, 7:52 PM IST
లండన్‌లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్‌ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె 'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' అంశంపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మహిళా సాధికారతపై ప్రత్యేకంగా ప్రసంగించారు.  భారత్ అన్ని రంగాల్లో రాణిస్తోందని, ప్రత్యేకంగా క్రీడా రంగంలో కూడా చక్కటి పురోగతి సాధిస్తోందని అన్నారు. స్త్రీల స్వశక్తీకరణకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ముఖ్యంగా మహిళల సాధికారతపై తన అభిప్రాయాలు బలంగా ఉన్నాయని, మహిళలను అన్ని రంగాల్లో రాణిస్తున్నారని నీతా అంబానీ తెలిపారు. మహిళలు క్రీడలను ఆడటంలో మాత్రమే కాదు, ప్రోత్సహించడంలో సైతం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహిళలు అన్ని అడ్డంకులు దాటుకొని వ్యాపారం, రాజకీయాలు, సేవా రంగం, వైద్యం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆమె తెలిపారు.



First published: October 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...