Sports Business Summit: భారత్‌లో ఫుట్ బాల్ ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది...నీతా అంబానీ

భారత్ లో ఫుట్ బాల్ విస్తరణకు చక్కటి అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ ఆవిష్కరణకు పురిగొల్పినట్లు నీతా తన అనుభవాలను పంచుకున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మూడో అతిపెద్ద వ్యూయర్ షిప్ కలిగిన లీగ్ గా ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ అవతరించిందని ఆమె పేర్కొన్నారు.

news18-telugu
Updated: October 8, 2019, 9:39 PM IST
Sports Business Summit: భారత్‌లో ఫుట్ బాల్ ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది...నీతా అంబానీ
నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్
news18-telugu
Updated: October 8, 2019, 9:39 PM IST
లండన్‌లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్‌ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె 'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' అంశంపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె ఐపీఎల్ విజయవంతం కావడం వల్లే దేశంలో మరెన్నో క్రీడలు కూడా లీగ్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చాయని నీతా అంబానీ అన్నారు. హాకీ, బాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, కబడ్డీ, అలాగే ఫుట్ బాల్ వంటి క్రీడలు ప్రైవేటు లీగ్స్ ద్వారా క్రీడాభిమానుల ఆదరణ పొందుతున్నాయని నీతా అంబానీ అన్నారు. అంతేకాదు..విదేశాల్లో నిర్వహించే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ చూసేందుకు భారత్ లో సైతం మధ్య రాత్రి నిద్రలేచి చూసే ఆదరణ పొందింది. అప్పుడే భవిష్యత్తులో ఫుట్ బాల్ పట్ల యువత విపరీతంగా ఆకర్షితులవుతున్నారని గమనించినట్లు ఆమె అన్నారు.

భారత్ లో ఫుట్ బాల్ విస్తరణకు చక్కటి అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ ఆవిష్కరణకు పురిగొల్పినట్లు నీతా తన అనుభవాలను పంచుకున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మూడో అతిపెద్ద వ్యూయర్ షిప్ కలిగిన లీగ్ గా ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ అవతరించిందని ఆమె పేర్కొన్నారు.



First published: October 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...