Home /News /business /

RELIANCE FOUNDATION CHAIRPERSON NITA AMBANI DELIVERED THE KEYNOTE ADDRESS AT THE SPORTS BUSINESS SUMMIT IN LONDON MK 2

Sports Business Summit: లండన్ బిజినెస్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో నీతా అంబానీ చరిత్రాత్మక ప్రసంగం

నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్

నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్

బుద్ధుడు, మహాత్మాగాంధీ జన్మస్థానమైన భారత్ నుంచి తాను ప్రతినిధిగా వచ్చానని, భారత దేశంలోని నూట ముప్ఫై కోట్ల మంది ప్రతినిధిగా ఈ వేదికపైకి వచ్చినందుకు గర్వపడుతున్నానని ఈ సందర్భంగా నీతా అంబానీ పేర్కొన్నారు. దాదాపు 600 మిలియన్ల మంది జనాభా సగటు వయస్సు 20 సంవత్సరాల లోపు అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత దేశంలోని యువతను అంతా ఒక దగ్గరకు చేరిస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని తెలిపారు.

ఇంకా చదవండి ...
  లండన్‌లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్‌ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె 'ఇన్ స్పైరింగ్ ఎ బిలియన్ డ్రీం: ది ఇండియా ఆపర్చునిటీ' అంశంపై తన అభిప్రాయాలను తెలియజేశారు. తన ప్రసంగంలో ముందుగా ప్రపంచంలోనే క్రీడా నిపుణులు, భాగస్వామ్య సంస్థలకు ఆమె అభివాదం తెలుపుతూ ప్రసంగించారు. బుద్ధుడు, మహాత్మాగాంధీ జన్మస్థానమైన భారత్ నుంచి తాను ప్రతినిధిగా వచ్చానని, భారత దేశంలోని నూట ముప్ఫై కోట్ల మంది ప్రతినిధిగా ఈ వేదికపైకి వచ్చినందుకు గర్వపడుతున్నానని ఈ సందర్భంగా నీతా అంబానీ పేర్కొన్నారు. దాదాపు 600 మిలియన్ల మంది జనాభా సగటు వయస్సు 20 సంవత్సరాల లోపు అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత దేశంలోని యువతను అంతా ఒక దగ్గరకు చేరిస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని తెలిపారు.

  భారత్ అన్ని రంగాల్లో రాణిస్తోందని, ప్రత్యేకంగా క్రీడా రంగంలో కూడా చక్కటి పురోగతి సాధిస్తోందని ఆమె అన్నారు. స్త్రీల స్వశక్తీకరణకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ముఖ్యంగా మహిళల సాధికారతపై తన అభిప్రాయాలు బలంగా ఉన్నాయని, మహిళలను అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు క్రీడలను ఆడటంలో మాత్రమే కాదు, ప్రోత్సహించడంలో సైతం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహిళలు అన్ని అడ్డంకులు దాటుకొని రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని అడ్డంకులు దాటుకొని వ్యాపారం, రాజకీయాలు, సేవా రంగం, వైద్యం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆమె తెలిపారు.


  ఈ సందర్భంగా ఆమె ఐపీఎల్ విజయవంతం కావడం వల్లే దేశంలో మరెన్నో క్రీడలు కూడా లీగ్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చాయని నీతా అంబానీ అన్నారు. హాకీ, బాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, కబడ్డీ, అలాగే ఫుట్ బాల్ వంటి క్రీడలు ప్రైవేటు లీగ్స్ ద్వారా క్రీడాభిమానుల ఆదరణ పొందుతున్నాయని నీతా అంబానీ అన్నారు. అంతేకాదు..విదేశాల్లో నిర్వహించే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ చూసేందుకు భారత్ లో సైతం మధ్య రాత్రి నిద్రలేచి చూసే ఆదరణ పొందింది. అప్పుడే భవిష్యత్తులో ఫుట్ బాల్ పట్ల యువత విపరీతంగా ఆకర్షితులవుతున్నారని గమనించినట్లు ఆమె అన్నారు. భారత్ లో ఫుట్ బాల్ విస్తరణకు చక్కటి అవకాశం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ ఆవిష్కరణకు పురిగొల్పినట్లు నీతా తన అనుభవాలను పంచుకున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మూడో అతిపెద్ద వ్యూయర్ షిప్ కలిగిన లీగ్ గా ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ అవతరించిందని ఆమె పేర్కొన్నారు.


  అంతేకాదు ఈ సందర్భంగా టీమిండియా టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆమె కొనియాడారు. బూమ్రా వంటి యంగ్ ఆటగాళ్లను ఎందరినో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ్నుంచి ఎప్పుడైన వస్తుందన్నారు. జస్పీత్ బుమ్రా ఎలా క్రికెట్‌లో అడుగుపెట్టాడన్న దానిపై నీతా అంబాని ఓ డాక్యమెంటరీ ద్వారా సదస్సుకు హాజరైన వారికి చూపించారు. జస్ప్రిత్ బుమ్రా ఐదేళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. అప్పట్నుంచి అతని కుటుంబం ఎన్నో కష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్క జత బట్టలు, షూలతోనే ఎన్నోరోజులు బతకాల్సి వచ్చింది. కానీ ఎవరూ ఒకరు మనలో ఉన్న ప్రతిభను తప్పక గుర్తిస్తారన్న నమ్మకం చిన్నప్పటి నుంచి తనలో ఉండేదని తెలిపాడు బుమ్రా. బుమ్రాను ఫస్ట్ టైం ఐపీఎల్‌ మ్యాచ్‌లో చూసినప్పుడు తనను తాను నమ్మలేకపోయానని బూమ్రా తల్లి కళ్లలో నీళ్లు తిప్పుకుంటూ ఆనందం వ్యక్తంచేశారు. బూమ్రా దగ్గర ఇప్పుడు ఎన్నో రకాల షూ, బట్టలు ఉన్నాయన్నారు. ఇలా బూమ్రా జీవితంలో ఒడిదుడుకులకు సంబంధించిన వీడియోను నీతా అంబాని స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్‌లో ప్రదర్శించారు. ఈ రోజు బుమ్రా ఎంతోమంది యువత ఆదర్శమన్నారు నీతా అంబాని. గత పదేళ్ళలో హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా లాంటి ఎంతోమంది యువ ఆటగాళ్లను తెరపైకి తీసుకొచ్చామన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి యువకుడి, అమ్మాయి కలలు కని వాటిని నిజం చేసేందుకు ధైర్యం చూపాలన్నారు నీతా అంబాని.


  అంతేకాదు రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశంలో జూనియర్ ఎన్‌బీఏ కార్యక్రమాలను నిర్వహించిందని, ఇందులో 20 రాష్ట్రాల్లోని 34 నగరాల నుండి 1.10 కోట్ల మంది పిల్లలు కనెక్ట్ అయినట్లు తెలిపారు. గత వారం, రిలయన్స్ ఫౌండేషన్ సాక్రమెంటో కింగ్స్ మరియు ఇండియానా పేసర్స్ మధ్య ఒక మ్యాచ్ నిర్వహించిందని నీతా అంబానీ తెలిపారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సుమారు ఐదు వేల విద్యా సంస్థలలోని 40 లక్షల మంది పిల్లలను ప్రభావితం చేసిందని తెలిపారు.

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వడం గురించి నీతా అంబానీ ప్రస్తావించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక కార్యక్రమాలను ప్రారంభించారని. ఆయన 'ఖేలో ఇండియా', 'ఫిట్ ఇండియా ఉద్యమం' ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు.


  ఇదిలా ఉంటే 2019 అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై 10వ తేదీ ముగియనున్న ఈ సదస్సులో క్రీడల భవిష్యత్తు, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రాధాన్యతలపై ప్రభావం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. ఈ సందస్సులో నీతా అంబానీతో పాటు, ప్రపంచం నలుమూలల నుండి 3 వేల మంది కార్పోరేట్ దిగ్గజాలు పాల్గొననున్నారు.

  నీతా అంబానీ ప్రసంగం పూర్తి పాఠం
  First published:

  Tags: Business, London, Nita Ambani, Reliance, Sports

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు