భారతదేశంలో మహిళలకు డిజిటల్ స్కిల్స్ అందించేందుకు వుమెన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ-W-GDP, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్-USAID సంస్థలతో రిలయెన్స్ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. యూనైటెడ్ స్టేట్స్ డిప్యూటీ సెక్రెటరీ స్టీఫెన్ బీగన్ నిర్వహించిన W-GDP ఈవెంట్లో ఈ ఒప్పందం కుదిరింది. www.state.gov వెబ్సైట్లో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్‌లో అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్ ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు డిప్యూటీ USAID అడ్మినిస్ట్రేటర్ బొన్నీ గ్లిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఈవెంట్లో వర్చువల్ వీడియో ద్వారా రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్పర్సన్ నీతా అంబానీ సందేశాన్ని ఇచ్చారు. W-GDP వుమెన్కనెక్ట్ ఛాలెంజ్ ద్వారా ప్రైవేట్ రంగంలో జెండర్ డిజిటల్ డివైడ్ తొలగించడానికి, మహిళలు తమ వ్యాపార అవకాశాలు పెంపొందించడానికి, మహిళా సాధికారత సాధించడానికి రిలయెన్స్ ఫౌండేషన్ పలు కార్యక్రమాలు చేపట్టునుంది.
2016లో రిలయెన్స్ జియోను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా 130 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ లైఫ్ అందించడమే కాకుండా దేశమంతా గతంలో ఎన్నడూ ఊహించని విధంగా డిజిటల్ విప్లవానికి జియో కారణమైంది. ప్రస్తుతం జియో భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ సర్వీసెస్ కంపెనీ కాగా, ప్రపంచంలో రెండో కంపెనీ. భారతదేశంలో 12 కోట్ల మంది మహిళలు జియో యూజర్లు. వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది రిలయెన్స్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి రిలయెన్స్ ఫౌండేషన్ సేవలు అందాయి. భారతదేశంలో వుమెన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ-W-GDP కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు జియో, రిలయెన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా సహకారం అందించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Nita Ambani, Reliance, Reliance Foundation, Reliance Jio