రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి మంది ఉపాధ్యాయులకు టీపీఓ పురస్కారాలు...

సెంటా పురస్కారం (Twitter)

సెంటా టీపీవో 2019 ద్వారా ఉపాధ్యాయుల్లో ప్రతిభనుగుర్తించే ప్రయాణాన్ని కొనసాగించేందుకు నిర్ణయించింది. సెంటా టీపీఓ 2019లో సైతం జాతీయ స్థాయిలో మొత్తం వెయ్యి మంది విజేతలకు నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం ఇవ్వనున్నారు.

  • Share this:
    సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్ (సెంటా) టీచింగ్ ప్రొఫెషనల్ ఒలింపియాడ్ (టిపిఓ) 2018 లో రాణించిన 1000 మంది ఉపాధ్యాయులకు రిలయన్స్ ఫౌండేషన్ పురస్కారాలను ప్రదానం చేసింది. సెంటా టిపిఓ 2018 విజేతలను యునెస్కో, యునిసెఫ్, సిబిఎస్‌ఇ బోర్డు తదితర ప్రతిష్టాత్మక సంస్థల సమక్షంలో వీరిని ఘనంగా సత్కరించారు, అనంతరం సెంటా టిపిఓ 5వ ఎడిషన్ జాతీయ స్థాయిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ సెంటా భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డుల తదుపరి ఎడిషన్‌ను ప్రకటించింది. సెంటా టీపీవో 2019 ద్వారా ఉపాధ్యాయుల్లో ప్రతిభనుగుర్తించే ప్రయాణాన్ని కొనసాగించేందుకు నిర్ణయించింది. సెంటా టీపీఓ 2019లో సైతం జాతీయ స్థాయిలో మొత్తం వెయ్యి మంది విజేతలకు నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం ఇవ్వనున్నారు. అంతేకాదు సెంటా టీచింగ్ ప్రొఫెషనల్ ఒలింపియాడ్ (టీపీఓ) డిసెంబర్ 14, 2019 న భారతదేశంలోని 75 నగరాలతో పాటు దుబాయ్ మరియు అబుదాబిలలో జరుగుతుంది.

    ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఇషా అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డుల ద్వారా ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుల కృషి, అంకితభావాన్ని గుర్తించినందుకు గర్విస్తున్నామని తెలిపారు. దేశ భవిష్యత్తును రూపొందించే నైపుణ్యంతో యువకులను సన్నద్ధం చేయడంలో ఉపాధ్యాయులు పాత్ర అమూల్యమైనదని అన్నారు.
    First published: