బిజినెస్

  • Associate Partner
  • diwali-2020
  • diwali-2020
  • diwali-2020

Reliance Digital: రిలయన్స్ డిజిటల్‌లో దీపావళికి ప్రత్యేక ఆఫర్లు.. వీటిపై భారీ తగ్గింపు

Reliance Digital Diwali Offers: రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ మరియు www.reliancedigital.in వద్ద ఆన్‌లైన్ షాపింగ్‌లో HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మరియు ఈజీ ఇఎమ్ఐ మీద 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

news18-telugu
Updated: November 10, 2020, 9:19 PM IST
Reliance Digital: రిలయన్స్ డిజిటల్‌లో దీపావళికి ప్రత్యేక ఆఫర్లు.. వీటిపై భారీ తగ్గింపు
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
రిలయన్స్ డిజిటల్ ఈ సంవత్సరం ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా అతిపెద్ద, మెరుగైన ఆఫర్లు అందిస్తోంది. కస్టమర్లకు విస్తృత శ్రేణిలోని ఎలక్ట్రానిక్స్ మీద సాటిలేని డీల్స్ సౌకర్యం లభిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ మరియు www.reliancedigital.in వద్ద ఆన్‌లైన్ షాపింగ్‌లో HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మరియు ఈజీ ఇఎమ్ఐ మీద 10% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. కస్టమర్లు సిటిబ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు కోటక్ మహీంద్ర బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మరియు ఇఎమ్ఐ మీద రూ. 4500/- వరకు డిస్కౌంట్ కూడా పొందగలుతారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కస్టమర్లు అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డుల మీద రూ. 2000/- ఫ్లాట్ డిస్కౌంట్ పొందుతారు. రిలయన్స్ డిజిటల్ నుంచి ఈ పండుగకు బహుమతిగా షాపర్లకు రూ. 1000/- వరకు విలువైన వోచర్లు లభిస్తాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అమ్మకాలు 16 నవంబరు వరకు కొనసాగుతాయి.

అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు వివిధ కేటగిరీలలో లభిస్తున్నాయి. మొబైల్ ఫోన్లు ఆఫర్లలో శామ్సంగ్ గేలక్సీ S20 ఇప్పుడు హెచ్.డి.ఎఫ్.సి క్యాష్ బ్యాక్ చేర్చి రూ. 40,999 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఇంకా కొత్తగా ప్రవేశపెట్టబడిన ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 ప్రో మీద కూడా ఆఫర్లతో ఈ మొబైల్ ఫోన్స్ లభిస్తాయి. కస్టమర్లకు 40% అస్యూర్డ్ బై బ్యాక్ సౌకర్యంతో, కేవలం నెలకు రూ. 2,796 తో ప్రారంభమయ్యే ఐఫోన్ 11 కూడా లభిస్తుంది. వాచీల కేటగిరీలో, శామ్సంగ్ గేలక్సీ వాచ్ ఎల్.టి.ఇ (42mm) హెచ్.డి.ఎఫ్.సి క్యాష్ బ్యాక్ చేర్చి రూ. 13,950కి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

ఈ పండుగ సీజన్ లో తమ ప్రోడక్టివిటీని పెంచుకోవాలని అనుకునేవారు, కేవలం రూ. 18,999 ధరలో 2 సంవత్సరాల వారంటీ మరియు రూ. 6,800 ప్రయోజనాలతో లభించే ఆసస్ ధిన్ & లైట్ ల్యాప్ టాప్స్ మీద ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు. డెల్ ఇంటెల్ కోర్ i3 ల్యాప్ టాప్స్ రూ. 37,499 ధరతో, మరియు హెచ్.పి. ఎ.ఎమ్.డి రైజన 5 ల్యాప్ టాప్స్ రూ. 41,290 ధరతో, మరియు ఇంటెల్ 11వ జెన్ ల్యాప్ టాప్స్ ఎమ్.ఎస్. ఆఫీస్ ప్రి-ఇన్స్టాల్డ్ తో రూ. 47,999 ధరతో ప్రారంభం అవుతున్నాయి. గేమ్స్ మీద ఆసక్తి కలిగిన కస్టమర్లకు గేమింగ్ ల్యాప్ టప్స్ ఫ్లాట్ 10% తగ్గింపుతో లభించటం వారికి ఆనందం కలిగిస్తుంది. ఇంటి నుండి పిల్లల చదువులను పెంపొందించాలని అనుకునేవారి కొరకు రూ. 11,999 ధరతో ప్రారంభమయ్యే LTE సౌకర్యం కలిగిన శామ్సంగ్ ట్యాబ్ మా వద్ద లభిస్తుంది.

కస్టమర్లకు టెలివిజన్ల మీద ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తున్నవి, 32” స్మార్ట్ టీవీలు (హిసెన్స్. తోషిబా, వన్ ప్లస్ మరియు టి.సి.ఎల్) మీద 3 సంవత్సరాల వారంటీతో రూ. 12,490 ధరలతో, మరియు శామ్సంగ్ 50” QLED స్మార్ట్ టీవీ 3 సంవత్సరాల వారంటీ మరియు 3 నెలల ఉచిత నెట్ ఫ్లిక్స్ చందాతో రూ. 64,990 ధరలో లభిస్తాయి.

హోమ్ అప్లయన్సులు కొరకు చూసేవారికి రూ. 49,990 ధరతో ప్రారంభమయ్యే సైడ్-బై-సైడ్ రెఫ్రిజరేటర్లు, రూ. 11,990 తో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు మరియు రూ. 42,990 ధరతో ప్రారంభమయ్యే వాషర్-డ్రయ్యర్స్ లభిస్తాయి. స్పేస్ మ్యాక్స్ ఫ్యామిలీ హబ్ కొనే కస్టమర్లకు ఉచిత నోట్ 10 లైట్ రూ. 43,000 విలువైనది లభిస్తుంది.

ఈ సంవత్సరం, ఈజీ ఫైనాన్సింగ్ మరియు ఇ.ఎమ్.ఐ ఎంపికలతో ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనుభవం మరింత రివార్డింగ్‌గా ఉంటుంది. కస్టమర్లకు ఏదైనా రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ లేదా www.reliancedigital.in ని ఎంచుకుని షాపింగ్ చేసి, ఇన్ స్టాంట్ డెలివరీ (3 గంటల లోపే డెలివరీ) మరియు తమ దగ్గరలోని స్టోరు నుండి స్టోర్ పిక్ అప్ ఆప్షన్లు పొందే సౌకర్యం కూడా పొందగలుగుతారు. అయితే ఈ ఆఫర్లకు సంబంధించి నియమ నిబంధనలు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది.
Published by: Kishore Akkaladevi
First published: November 10, 2020, 9:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading