Home /News /business /

RELIANCE DIGITAL DIGITAL INDIA SALE ENDS ON AUGUST 16TH KNOW ABOUT OFFERS AND DISCOUNTS SS

Reliance Digital: డిజిటల్ ఇండియా సేల్‌లో రేపటి వరకే ఈ ఆఫర్స్

Reliance Digital: డిజిటల్ ఇండియా సేల్‌లో రేపటి వరకే ఈ ఆఫర్స్
(image: Reliance Digital)

Reliance Digital: డిజిటల్ ఇండియా సేల్‌లో రేపటి వరకే ఈ ఆఫర్స్ (image: Reliance Digital)

Reliance Digital | రిలయన్స్ డిజిటల్ నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా సేల్‌లో (Digital India Sale) భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్‌పై ఆఫర్స్ మరో రోజు మాత్రమే పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
రిలయన్స్ డిజిటల్ భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ సేల్‌ను నిర్వహిస్తోంది. డిజిటల్ ఇండియా సేల్ (Digital India Sale) పేరుతో భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. అన్ని కేటగిరీల్లో డిస్కౌంట్స్ పొందొచ్చు. ప్రముఖ బ్యాంకుల కార్డులతో (Bank Offers) 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్స్ ఆగస్ట్ 16 వరకే లభిస్తాయి. 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు తర్వాతి కొనుగోళ్లకు రీడీమ్ చేసుకునేందుకు 10 శాతం డిస్కౌంట్ వోచర్స్ కూడా లభిస్తాయి. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికీ ఆప్షన్స్ ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ (Reliance Digital), మైజియో స్టోర్స్, www.reliancedigital.in వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్ టాప్స్, టీవీలు, కిచెన్ అండ్ హోమ్ అప్లయెన్సెస్, ఇతర ప్రొడక్ట్స్ కొనేవారు ఈ ఆఫర్స్ పొందొచ్చు.

అల్‌ట్రా హెచ్‌డీ టీవీలు నమ్మశక్యంకాని ధరలకే లభిస్తున్నాయి. 65 అంగుళాల అల్‌ట్రా హెచ్‌డీ టీవీని రెండేళ్ల వారెంటీతో కేవలం రూ.49,990 ధర నుంచే సొంతం చేసుకోవచ్చు. ఇక 43 అంగుళాల అల్‌ట్రా హెచ్‌డీ టీవీని రెండేళ్ల వారెంటీతో కేవలం రూ.19,990 ధర నుంచి కొనొచ్చు. యాపిల్ ఎయిర్‌పాడ్స్ రెండో జనరేషన్ కేవలం రూ.8490 ధరకే లభిస్తోంది.

IRCTC Ramayan Yatra: అయోధ్య చూస్తారా? హైదరాబాద్ నుంచి రామాయణ యాత్ర... ప్యాకేజీ వివరాలివే

రిలయన్స్ డిజిటల్‌లో ల్యాప్‌టాప్స్ పైనా ఆఫర్స్ ఉన్నాయి. హెచ్‌పీ స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ రూ.43,999 ధరకే లభిస్తోంది. ఇందులో ఇంటెల్ కోర్ ఐ3, 8జీబీ ర్యామ్, 512ఎస్ఎస్‌డీ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ను రూ.1295 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. 100జీబీ జియో డేటా ఉచితంగా లభిస్తుంది. ఏసుస్ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ.55,990 ధరకే లభిస్తోంది. ఇందులో 16జీబీ ర్యామ్, 512ఎస్ఎస్‌డీ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.4666 ఈఎంఐతో కొనొచ్చు.

రిలయన్స్ డిజిటల్‌లో కొనుగోలు చేసే అందరికీ బహుమతులు లభిస్తాయి. కొందరు లక్కీ విన్నర్స్ కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లు గెలుచుకోవచ్చు. ఐఫోన్ 13 128జీబీ వేరియంట్ రూ.65,500 ధరకు, ఐఫోన్ 12 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.53,300 ధరకు, ఐఫోన్ 11 128జీబీ వేరియంట్ రూ.47,900 ధరకు కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ కూడా భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో కొత్త రూల్... వారికి షాక్



హోమ్ అప్లయెన్సెస్ పైనా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆఫర్స్ ఉన్నాయి. సాంసంగ్ డిష్‌వాషర్‌ను రూ.29,990 ధరకు కొనొచ్చు. రూ.9,990 విలువైన ఫిలిప్స్ గార్మెంట్ స్టీమర్ ఉచితంగా లభిస్తుంది. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొంటే స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచీలు, ట్యాబ్లెట్స్, మినీ బార్స్ లాంటి ప్రొడక్ట్స్ ఉచితంగా లభిస్తాయి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ రెండేళ్ల వారెంటీతో రూ.18,990 ధరకే లభిస్తుంది. ఇక స్మాల్ అప్లయెన్సెస్ విషయానికి వస్తే బ్రేక్‌ఫాస్ట్ కాంబోస్ రూ.1,799 ధర నుంచి లభిస్తాయి. ఎయిర్ కండీషనర్లపై 60 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. బ్రాండ్ న్యూ మైక్రోవేవ్ ఓవెన్లను రూ.6,490 నుంచే కొనొచ్చు. అన్ని ఆఫర్లకు నియమనిబంధనలు, షరతులు వర్తిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Reliance Digital, Smart TV, Smartphone

తదుపరి వార్తలు