• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • RELIANCE CREATES HISTORY BECOMES FIRST INDIAN COMPANY TO HIT RS 9 LAKH CRORE M CAP MARK BA

Reliance | చరిత్ర సృష్టించిన రిలయన్స్.. రూ.9లక్షల కోట్ల మార్కెట్ క్యాప్...

Reliance | చరిత్ర సృష్టించిన రిలయన్స్.. రూ.9లక్షల కోట్ల మార్కెట్ క్యాప్...

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం)

Reliance | రిలయన్స్ మార్కెట్ క్యాప్ 9,01,490.09 కోట్లకు చేరింది. ఇవాళ కూడా రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగాయి.

  • Share this:
    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శుక్రవారం చరిత్రాత్మక మైలురాయిని టచ్ చేసింది. రూ.9లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్‌ను టచ్ చేసిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. ఇవాళ ఉదయం బీఎస్ఈలో ట్రేడింగ్ సందర్భంగా రిలయన్స్ మార్కెట్ క్యాప్ 9,01,490.09 కోట్లకు చేరింది. ఇవాళ కూడా రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగాయి. ఓ దశలో రిలయన్స్ షేర్ 2.28 శాతం వృద్ధి చెంది షేర్ విలువ రూ.1,428 రికార్డు ధరకు చేరుకుంది. 2018 ఆగస్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.8లక్షల కోట్ల మార్కెట్ వాల్యూని అందుకుంది. అప్పుడు కూడా రూ.8లక్షల కోట్ల మార్కెట్ వాల్యూని అందుకున్న తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. అయితే, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్ విలువ పెరుగుదల, తగ్గుదల మీద ఆధారపడి ఉంటుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: