రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శుక్రవారం చరిత్రాత్మక మైలురాయిని టచ్ చేసింది. రూ.9లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్‌ను టచ్ చేసిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. ఇవాళ ఉదయం బీఎస్ఈలో ట్రేడింగ్ సందర్భంగా రిలయన్స్ మార్కెట్ క్యాప్ 9,01,490.09 కోట్లకు చేరింది. ఇవాళ కూడా రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగాయి. ఓ దశలో రిలయన్స్ షేర్ 2.28 శాతం వృద్ధి చెంది షేర్ విలువ రూ.1,428 రికార్డు ధరకు చేరుకుంది. 2018 ఆగస్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.8లక్షల కోట్ల మార్కెట్ వాల్యూని అందుకుంది. అప్పుడు కూడా రూ.8లక్షల కోట్ల మార్కెట్ వాల్యూని అందుకున్న తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. అయితే, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ విలువ పెరుగుదల, తగ్గుదల మీద ఆధారపడి ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.