హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance AGM 2022: పన్ను చెల్లింపు.. ఉద్యోగాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించామన్న ముఖేష్ అంబానీ

Reliance AGM 2022: పన్ను చెల్లింపు.. ఉద్యోగాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించామన్న ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ

Reliance AGM: కంపెనీ వార్షిక ఆదాయంలో $100 బిలియన్లను దాటిన భారతదేశపు మొదటి కార్పొరేట్‌గా రిలయన్స్ అవతరించిందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రిలయన్స్ భారతదేశంలో అతిపెద్ద పన్ను చెల్లింపుదారుగా కొనసాగిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ ఎండీ ముఖేష్ అంబానీ తెలిపారు. జాతీయ ఖజానాకు రూ. 188,000 కోట్లకు పైగా అందించిందని అంబానీ తెలిపారు. ఉద్యోగాల కల్పనలో(Jobs Creations) రిలయన్స్ కొత్త రికార్డును నెలకొల్పిందని ఆయన తెలిపారు. వ్యాపారాల్లో 2.32 లక్షల ఉద్యోగాలను కల్పించిందని వివరించారు. రిలయన్స్ రిటైల్(Reliance Retail) ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ఉద్యోగాలు కల్పించే సంస్థగా ఉందని తెలిపారు. రిలయన్స్ ఎగుమతులు(Exports) భారీగా పెరిగాయిని అన్నారు. ఎగుమతులు 75% పెరిగి రూ.2,50,000 కోట్లు దాటాయని తెలిపారు. గత సంవత్సరం 6.8% నుండి ఈ సంవత్సరంలో ఎగుమతుల్లో దాదాపు 8.4% సాధించామని ముఖేష్ అంబానీ చెప్పారు.


  కంపెనీ వార్షిక ఆదాయంలో $100 బిలియన్లను దాటిన భారతదేశపు మొదటి కార్పొరేట్‌గా రిలయన్స్ అవతరించిందని వెల్లడించారు. రిలయన్స్ ఏకీకృత ఆదాయాలు 47% పెరిగి $104.6 బిలియన్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. రిలయన్స్ వార్షిక ఏకీకృత EBITDA రూ. 1.25 లక్షల కోట్ల కీలక మైలురాయిని దాటిందని ముఖేష్ అంబానీ ప్రకటించారు.


  ఇక ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉందని.. అధిక ద్రవ్యోల్బణం మరియు సరఫరా అంతరాయాలు గ్లోబల్ మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉందని అని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. రిలయన్స్ భారతదేశం శ్రేయస్సు, పురోగతికి ఇప్పటివరకు చేసిన దానికంటే చాలా గొప్ప సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని ముఖేష్ అంబానీ చెప్పారు. ఇక వచ్చే ఏడాది RIL AGM ఒక హైబ్రిడ్ మోడ్‌కి మారగలదని ముఖేష్ అంబానీ చెప్పారు. ఇది భౌతిక, డిజిటల్ మోడ్‌లలో ఉత్తమమైన వాటిని మిళితం చేస్తుందని ఆశించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Reliance Industries

  ఉత్తమ కథలు