Sosyo Hajoori Beverages | ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా కొనసాగుతూ వస్తున్న ముకేశ్ అంబానీ కొత్త ఏడాదిలో కొత్త డీల్‌కు తెరతీశారు. ఈయనకు చెందిన రిలయన్స్ రిటైల్ (Reliance Retail) ముఖ్యమైన ప్రకటన చేసింది. రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ కంపెనీ గుజరాత్‌కు చెందిన సోస్యో హజూరి బేవరేజెస్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కూల్ డ్రింక్స్ తయారు చేసే కంపనీ. సోస్యో (Sosyo) బ్రాండ్ కింద కూల్ డ్రింక్స్ తయారు చేసి విక్రయిస్తోంది. ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌కు చెందిన రిలయన్స్ కన్యూమర్ ప్రొడక్ట్స్ ఈ బ్రాండ్‌ను సొంతం చేసుకుంది.
కొత్త డీల్ ప్రకారం చూస్తే.. సోస్యో హజూరి బేవరేజెస్‌లో అంబానీలకు 50 శాతం వాటా, మిగిలిన సగం వాటా హజూరి కుటుంబానికి ఉంటుంది. సోస్యో హజూరి బేవరేజెస్ కంపెనీ 100 ఏళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ రావడం గమనార్హం. భారత స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ ఉద్యమం ఉత్పత్తి సోస్యోను 1923లో అబ్బాస్ అబ్దుల్ రహీం హజూరి స్థాపించారు. దేశీ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో కార్యకలాపాలు అందిస్తున్న ప్రముఖ కంపెనీల్లో సోస్యో హజూరి బేవరేజెస్ కూడా ఒకటిగా కొనసాగుతోంది.
భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. కారు కొంటే ఏకంగా రూ.72 వేల తగ్గింపు!
అబ్బాస్ హజూరి, ఆయన కుమారుడు అలియాస్గర్ హజూరి ఈ కంపెనీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఈ కంపెనీ పలు బ్రాండ్ల కింద ప్రొడక్టులను విక్రయిస్తోంది. సోస్యో, కశ్మీరా, లీమీ, జిన్లీన్, రున్నార్, ఓపెనర్, హజూరి సోడా వంటి పలు బ్రాండ్ల కింద ప్రొడక్టులను మార్కెట్‌లో కస్టమర్లకు అందిస్తోంది. ఈ కంపెనీ ఏకంగా 100కి పైగా ఫ్లేవర్లను కలిగి ఉంది. ఫార్ములేషన్స్ రూపకల్పనలో ఈ కంపెనీకి విశేష అనుభవం ఉందని చెప్పుకోవచ్చు. గుజరాత్‌లో సోస్యో బ్రాండ్‌కు లాయల్ కస్టమర్లు ఉన్నారు.
ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం, 3 నెలలు వరకు..
రియలన్స్ రిటైల్ తాజా జాయింట్ వెంచర్‌తో బేవరేజెస్ విభాగంలో తన స్ఠానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే చంపా బ్రాండ్‌ను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సోస్యో ఫార్ములేషన్ అనుభవంతో కస్టమర్లకు ఇంకా వినూత్నమైన ప్రొడక్టులను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది.
ఆర్ఆర్‌వీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. వంద ఏళ్ల నాటి చరిత్ర కలిగిన స్వదేశీ బేవరేజెస్ బ్రాండ్ సోస్యోను తమ కన్సూమర్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. తమ బలమైన నెట్‌వర్క్, పరిజ్ఞానం, వినియోగదారుల వల్ల సోస్యో బ్రాండ్ ఎదుగుదలకు మరింత దోహదపడతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని సోస్యో హజూరి బేవరేజెస్ చైర్మన్ అబ్బాస్ హజూరి తెలిపారు. తమకు బలమైన, సుముఖమైన భాగస్వామి లభించిందని, దీని వల్ల సోస్యో వేగంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలో వినియోగదారులు అందరికీ చేరువ అవుతామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Isha Ambani, Mukesh Ambani, Reliance, Reliance retail