ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోటస్ చాక్లెట్స్ లో 51 శాతం వాటను కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (Reliance Consumer Products Limited (“RCPL”)) ద్వారా ఈ కొనుగోలు జరిగింది. మొత్తం రూ.74 కోట్లకు ఈ డీల్ జరిగింది.
డీల్ వివరాలు:
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, లోటస్ యొక్క 65, 48, 935 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఇది కంపెనీ ప్రస్తుత ప్రమోటర్ మరియు ప్రమోటర్ గ్రూప్ లో 51 శాతం వాటా. ఒక్కో షేర్ కు రూ.113 చొప్పున మొత్తం రూ.74 కోట్లతో ఈ డీల్ జరిగింది. లోటస్ పబ్లిక్ షేర్ హోల్డర్లకు 26 శాతం ఓపెన్ ఆఫర్ ను కూడా కంపెనీ ప్రకటించింది. దీని కింద లోటస్ యొక్క 33,38,673 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయబడతాయి.
ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. లోటస్ యొక్క అనుభవం కలిగిన మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నామన్నారు. వ్యాపారాన్ని విస్తరించి మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. లోటస్ వ్యవస్థాపకుడు ప్రమోటర్ అభిజిత్ పాయ్ మాట్లాడుతూ.. తాము రిలయన్స్ తో జతకట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా తాము రిలయన్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉంటామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Isha Ambani, Mukesh Ambani, Reliance retail