హోమ్ /వార్తలు /బిజినెస్ /

Campa Brand: ‘క్యాంపా’ కూల్‌డ్రింక్ మళ్లీ వచ్చేసింది.. రీలాంచ్ చేసిన రిలయన్స్.. 5 ప్యాక్‌లలో లభ్యం

Campa Brand: ‘క్యాంపా’ కూల్‌డ్రింక్ మళ్లీ వచ్చేసింది.. రీలాంచ్ చేసిన రిలయన్స్.. 5 ప్యాక్‌లలో లభ్యం

Campa Brand: ‘క్యాంపా’ కూల్‌డ్రింక్ మళ్లీ వచ్చేసింది..

Campa Brand: ‘క్యాంపా’ కూల్‌డ్రింక్ మళ్లీ వచ్చేసింది..

Campa Brand:ఒకప్పుడు భారత్‌లో పేరొందిన ఇండియన్ కూల్‌డ్రిక్ బ్రాండ్ ‘క్యాంపా’ మళ్ళీ వచ్చేసింది. 50ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ‘క్యాంపా’ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎట్టకేలకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్చి 9న ‘క్యాంపా’ బ్రాండ్ పేరుమీద మూడు రకాల సాఫ్ట్‌డ్రింక్స్‌ను పరిచయం చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఒకప్పుడు భారత్‌లో పేరొందిన ఇండియన్ కూల్‌డ్రిక్ బ్రాండ్ ‘క్యాంపా’ (Campa) మళ్ళీ వచ్చేసింది. 50ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ‘క్యాంపా’ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎట్టకేలకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్చి 9న ‘క్యాంపా’ బ్రాండ్ పేరుమీద మూడు రకాల సాఫ్ట్‌డ్రింక్స్‌ను పరిచయం చేసింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాస్ట్ మూవింగ్ కన్‌జ్యూమర్ గూడ్స్ విభాగం అయిన రిలయన్స్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(Reliance Consumer Products Limited) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బ్రాండ్ విశేషాలు, ఏయే క్వాంటిటీలో సాఫ్ట్ డ్రింక్స్ లభించనున్నాయి, తదితర వివరాలను తెలుసుకుందాం.

‘క్యాంపా’ బ్రాండ్‌‌ని రీలాంఛ్ చేస్తూ రిలయన్స్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(RCPL) నిర్ణయం తీసుకుంది. ఈ దేశీయ ఐకానిక్ బ్రాండ్‌ని మళ్ళీ పరిచయం చేస్తూ తొలుత మూడు కేటగిరీల్లో శీతల పానీయాలను ప్రవేశ పెట్టనుంది. క్యాంపా పోర్ట్‌ఫోలియోలో క్యాంపా కోలా(Campa Cola), క్యాంపా లెమన్(Campa lemon), క్యాంపా ఆరెంజ్(Campa Orange) రకాలను లాంఛ్ చేస్తున్నట్లు రిలయన్స్ ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

* 5 ప్యాక్‌లలో…

‘క్యాంపా’ ప్రొడక్ట్‌లు ఐదు ప్యాక్‌లలో లభించనున్నాయి. 200ml, 500ml, 600ml, 1000ml, 2000ml ప్యాక్‌లలో లెమన్, కోలా, ఆరెంజ్ సాఫ్ట్‌డ్రింక్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ వేసవికి ఆనాటి ‘ద గ్రేట్ ఇండియన్ టేస్ట్’ని క్యాంపా తిరిగి గుర్తుకు తెస్తుందని రిలయన్స్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన ప్రకటనలో ధీమా వ్యక్తం చేసింది.

* వేసవి నేపథ్యంలో కీలక నిర్ణయం

వేసవి సమీపిస్తున్న వేళ రిలయన్స్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ‘క్యాంపా’ బ్రాండ్‌ను రీ లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా వేసవిలో శీతల పానీయాలకు అధికంగా గిరాకీ ఉంటుంది. ఈ డిమాండ్‌ను అడ్వాంటేజీగా తీసుకొని కంపెనీ బ్రాండ్‌ని విస్తరించాలని రిలయన్స్ చూస్తోంది. వాస్తవానికి గతేడాదే ఈ ‘క్యాంపా’ బ్రాండ్‌ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హస్తగతం చేసుకుంది. తాజాగా, బ్రాండ్‌ని రీలాంఛ్ చేస్తూ కీలక ప్రకటన చేసింది.

* రూ.22 కోట్లకు డీల్

గతేడాది ఆగస్టులోనే ‘క్యాంపా’ బ్రాండ్‌ని రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. రూ.22 కోట్లకు డీల్ కుదుర్చుకుని దేశీయ బేవరేజెస్ బ్రాండ్‌ని హస్తగతం చేసుకుంది. ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ లిమిటెడ్(Pure Drinks Ltd) సంస్థ నుంచి ‘క్యాంపా’ బ్రాండ్‌ని దక్కించుకుంది. దాదాపు 7 నెలల విరామం అనంతరం బేవరేజీ బ్రాండ్‌ని రీలాంఛ్ చేసింది.

* వీటికి పోటీ

ప్రస్తుతం బేవరేజెస్ విభాగంలో విదేశీ కంపెనీలైన కోకోకోలా(Cococola), పెప్సికో(Pepsico) ప్రధానంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి చెందిన ఉత్పత్తులే దేశీయ మార్కెట్లో అధికంగా విక్రయం అవుతున్నాయి. వీటికి దేశీయ బ్రాండ్ అయిన ‘క్యాంపా’ పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి మూడు కేటగిరీల్లోనే శీతల పానీయాలు లభ్యం అవుతున్నప్పటికీ రానున్న రోజుల్లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మరిన్ని కేటగిరీలను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా మార్కెట్ పరిధిని విస్తృతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Reliance, Reliance Industries

ఉత్తమ కథలు