Home /News /business /

RELIANCE BRANDS SIGNS FRANCHISE AGREEMENT WITH ITALIAN LUXURY BRAND TODS DETAILS HERE GH VB

RBL Agreement: ఇటాలియన్ కంపెనీతో రిలయన్స్ బ్రాండ్స్ ఒప్పందం.. ఇండియాలో ఆ ప్రొడక్ట్స్‌కు అధికారిక రిటైలర్ గా RBL..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటాలియన్ లగ్జరీ లైఫ్ స్టైల్ సంస్థ Tod’s S.p.Aతో ఒప్పందం కుదుర్చుకుంది రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL). ఈ లాంగ్‌టర్మ్ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్‌తో ఫుట్‌వేర్, హ్యాండ్‌బ్యాగ్స్, యాక్ససరీస్ వంటి అన్ని రకాల టాడ్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్‌కు RBL భారతీయ మార్కెట్‌లో అధికారిక రిటైలర్‌గా మారింది.

ఇంకా చదవండి ...
ఇటాలియన్ లగ్జరీ లైఫ్ స్టైల్ సంస్థ Tod’s S.p.Aతో ఒప్పందం కుదుర్చుకుంది రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL). ఈ లాంగ్‌టర్మ్ ఫ్రాంచైజ్ అగ్రిమెంట్‌తో(Agreement) ఫుట్‌వేర్(Footwear), హ్యాండ్‌బ్యాగ్స్, యాక్ససరీస్ వంటి అన్ని రకాల టాడ్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్‌కు RBL భారతీయ మార్కెట్‌లో అధికారిక రిటైలర్‌గా మారింది. టాడ్స్ బ్రాండ్(Brand) 2008 నుంచి ఇండియాలో బిజినెస్ చేస్తోంది. న్యూఢిల్లీలోని DLF ఎంపోరియో, ముంబైలోని పల్లాడియం, మల్టీబ్రాండ్ ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్ అజియో లక్స్‌లో మోనో బ్రాండ్ స్టోర్‌లతో గుర్తింపు పొందింది. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఉన్న ఛానెల్‌ల నిర్వహణను రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్(Reliance Brands Limited) స్వాధీనం చేసుకుంటుంది. మార్కెట్‌లో బ్రాండ్ సామర్థ్యాన్ని పెంపొందించడం, డిజిటల్(Digital) ప్రెజెన్స్‌ను బలోపేతం చేయడంపై ఆర్బీఎల్ దృష్టి సారిస్తుంది.

Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

‘కొత్త వినియోగదారుల కోసం కొత్త ఆవిష్కరణలు చేయాలనే లక్ష్యంతో టాడ్స్ అద్భుతమైన హస్తకళను పునరుద్దరిస్తూ, గ్లోబల్ లగ్జరీ ఫ్రంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ స్పేస్‌ను రూపొందించుకుంది. విలాసవంతమైన లెదర్, మెటీరియల్‌కు ఈ బ్రాండ్ పేరొందింది. ఇండియన్ మార్కెట్లో అసాధారణమైన నాణ్యత, నైపుణ్యం వంటి ప్రధాన బ్రాండ్ విలువలను నిలబెట్టడానికి, పార్ట్నర్‌గా ఉండటానికి మేము సంతోషిస్తున్నాం’ అని తెలిపారు రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఎండీ దర్శన్ మెహతా. దేశంలోని ప్రముఖ లగ్జరీ రిటైలర్‌ అయిన రిలయన్స్ బ్రాండ్‌తో పార్ట్నర్‌షిప్ కుదుర్చుకోవడం సంతోషకరమైన విషయమని చెప్పారు టాడ్స్ జనరల్ బ్రాండ్ మేనేజర్ కార్లో అల్బెర్టో బెరెట్టా. నాణ్యత, ఆధునికత, అధునాతన జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఎల్‌తో ముందుకు సాగుతామని తెలిపారు.

రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ గురించి
RBL అనేది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో గ్లోబల్ బ్రాండ్‌లను ప్రారంభించడం, నిర్మించడం అనే లక్ష్యంతో 2007లో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. గత ఐదేళ్లలో RBL స్వదేశీ ఇండియన్ డిజైనర్ బ్రాండ్‌లను నిర్మించడంలో, నిర్వహించడంలో పెట్టుబడి పెట్టింది. బ్రాండ్ పార్ట్నర్స్ పోర్ట్‌ఫోలియోలో అర్మానీ ఎక్స్ఛేంజ్, బల్లీ, బొట్టెగా వెనెటా, బ్రూక్స్ బ్రదర్స్, బుర్బెర్రీ, కెనాలి, కోచ్, డీజిల్, డూన్, EA7, ఎంపోరియో అర్మానీ, ఎర్మెనెగిల్డో జెగ్నా, జి-స్టార్ రా, గ్యాస్, జార్జియో అర్మానీ, హామ్‌స్లీస్ అర్మానీ వంటి సంస్థలు ఉన్నాయి.

Business Idea: ఈ బిజినెస్ కు సర్కార్ సాయం.. లక్షల కొద్దీ ఆదాయం.. తెలుసుకోండి

టాడ్స్ గ్రూప్ గురించి
వందేళ్ల క్రితం చిన్న షూ ఫ్యాక్టరీగా స్థాపించిన TOD'S గ్రూప్.. హస్తకళపై దృష్టి సారించి ప్రొడక్ట్స్‌పై ఇటాలియన్ శైలిని ప్రతిబింబించింది. అన్ని TOD ఉత్పత్తులను పూర్తిగా ఇటలీలోనే తయారు చేస్తారు. TOD'S Gommino పేరుతో 1970ల చివర్లో కంపెనీ బిజినెస్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా విస్తరించింది. 2000, నవంబర్ 6న ఈ గ్రూప్ మిలన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది. 2013లో TOD'S మహిళలు కోసం, 2014లో పురుషుల కోసం రెడీ టూ వేర్ వార్డ్‌రోబ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం TOD's డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో ప్రపంచవ్యాప్తంగా 318 DOS, 88 ఫ్రాంచైజ్ స్టోర్‌లు ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: New products, Rbl, Reliance, Top brands

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు