Reliance Brands-Manish Malhotra: రిలయన్స్ బ్రాండ్స్ మనీష్ మల్హోత్రా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్‌ ఎండి దర్శన్ మెహతా, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా

Reliance Manish Malhotra: రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్‌తో సహకరించడం అనేది సహజమైన నిర్ణయమని మనీష్ మల్హోత్రా అన్నారు. ఇది రిలయన్స్ సంపూర్ణ దృష్టిని, డిజైన్ సంస్కృతి లోతైన అనుబంధాన్ని సూచిస్తుందని అన్నారు.

  • Share this:
    భారతీయ రిటైల్ దిగ్గజం రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL) 16 ఏళ్ల లగ్జరీ బ్రాండ్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టయిల్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లో 40 శాతం వాటా కొనుగోలు ప్రకటించింది. 2005లో ప్రారంభమైన ఎంఎం స్టయిల్స్‌ ఇండియన్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఎంఎం స్టయిల్స్‌కు దేశంలోనాలుగు స్టోర్లు ఉన్నాయి. వివిధ సోషల్ మీడియా ఛానెళ్లలో 12 మిలియన్లకు పైగా ఫాలోవర్ల నెట్‌వర్క్ ఉంది.

    రిలయన్స్(Reliance) బ్రాండ్స్ లిమిటెడ్‌ (RBL)కు భారతీయ మార్కెట్‌లో విస్తృతమైన ఫ్యాషన్ బ్రాండ్ భాగస్వామ్యాలను కలిగి ఉంది. ఇందులో అంతర్జాతీయ లేబుల్స్ టిఫనీ & కంపెనీ, జార్జియో అర్మానీ, డీజిల్, వెర్సేస్, టోరీ బిర్చ్ ఉన్నాయి. RBL భారతదేశంలో 595 స్టోర్లు, 744 షాప్-ఇన్-షాపులతో ఎక్కువ సంఖ్యలో రిటైల్ సదుపాయాలను కలిగి ఉంది.

    మనీష్ మల్హోత్రాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదరడంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ(Isha Ambani) హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు డిజైన్‌పై గౌరవం, భారతీయ కళ, సంస్కృతి పట్ల లోతైన నిబద్ధత ఉందని కొనియాడారు. ఒక వ్యాపారవేత్తగా, బ్రాండ్ వెనుక పనిచేసిన మనీష్ ఎల్లప్పుడూ వేగంగా దూసుకుపోతారని అన్నారు. ఈ రంగంలో భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ప్రశంసలు పొందారని అన్నారు. అలాంటి మనీష్‌తో ఈ ప్రయాణం మొదలుకావడం సంతోషంగా ఉందని తెలిపారు.

    రిటైల్ రంగం(Retail) విస్తరణతో పాటు, వ్యాపారాల కోసం బలమైన సాంకేతిక చట్రాన్ని సృష్టించడం, డిజిటల్, ఇ-కామర్స్ అవకాశాలను అభివృద్ధి చేయడం రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

    ఇక రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్‌తో సహకరించడం అనేది సహజమైన నిర్ణయమని మనీష్ మల్హోత్రా అన్నారు. ఇది రిలయన్స్ సంపూర్ణ దృష్టిని, డిజైన్ సంస్కృతి లోతైన అనుబంధాన్ని సూచిస్తుందని అన్నారు. వ్యాపారంలో కొత్తదనం సృజనాత్మకతను పునరుద్ధరించే ప్రయాణంలో తమకు ఇంతకంటే వ్యూహాత్మక భాగస్వామి మరొకరు లేరని తెలిపారు.

    Reliance: భారత్‌లో బెస్ట్ ఎంప్లాయర్‌గా నిలిచిన రిలయన్స్ గ్రూప్.. ఫోర్బ్స్ రేటింగ్‌లో సత్తా చాటిన సంస్థ

    Reliance Digital: అదిరిపోయే ఆఫర్స్‌తో వచ్చేసిన రిలయన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్

    ఫ్యాషన్ డిజైనర్‌గా తన 31 ఏళ్ల హిందీ సినిమా కెరీర్‌లో మనీష్ మల్హోత్రా 50 అవార్డులు గెలుచుకున్నారు. దాదాపు 800 సినిమాలకు ఆయన స్టయిలిష్ కాస్ట్యూమ్స్ సమకూర్చారు. నాలుగు తరాల నటులతో కలిసి పని చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: