259 ఏళ్ల బ్రిటీష్ టాయ్‌మేకర్ 'హామ్లేస్‌'ను సొంతం చేసుకున్న రిలయెన్స్

Reliance Hamleys Deal | హామ్లేస్ అతి పురాతనమైన టాయ్ మేకర్ బ్రాండ్. 1760 నుంచి ఉంది. 259 ఏళ్ల చరిత్ర ఈ బ్రాండ్ సొంతం. ప్రపంచంలోనే అతిపెద్ద టాయ్ బ్రాండ్ కూడా. 18 దేశాల్లో 167 స్టోర్లున్నాయి.

news18-telugu
Updated: May 10, 2019, 12:45 PM IST
259 ఏళ్ల బ్రిటీష్ టాయ్‌మేకర్ 'హామ్లేస్‌'ను సొంతం చేసుకున్న రిలయెన్స్
259 ఏళ్ల బ్రిటీష్ టాయ్‌మేకర్ 'హామ్లేస్‌'ను సొంతం చేసుకున్న రిలయెన్స్
news18-telugu
Updated: May 10, 2019, 12:45 PM IST
సుమారు 259 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ టాయ్ మేకర్ సంస్థ హామ్లేస్‌ని రిలయెన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బ్రాండ్ సీ బ్యానర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ చేతిలో ఉన్న హామ్లేస్‌ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో 100 శాతం షేర్లు సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది రిలయెన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ సంస్థ అయిన రిలయెన్స్ బ్రాండ్స్ లిమిటెడ్. అంతర్జాతీయ వ్యాపార రంగంలో రిలయెన్స్‌కు ఇది మరో మైలురాయి అని చెప్పాలి. హామ్లేస్ అతి పురాతనమైన టాయ్ మేకర్ బ్రాండ్. 1760 నుంచి ఉంది. 259 ఏళ్ల చరిత్ర ఈ బ్రాండ్ సొంతం. ప్రపంచంలోనే అతిపెద్ద టాయ్ బ్రాండ్ కూడా. 18 దేశాల్లో 167 స్టోర్లున్నాయి. భారతదేశంలో హామ్లేస్ ఫ్రాంఛైజీని చాలాకాలం క్రితమే రిలయెన్స్ సొంతం చేసుకుంది. 29 పట్టణాల్లో 88 స్టోర్లను ఏర్పాటు చేసింది రిలయెన్స్. తాజాగా చేసుకున్న ఒప్పందంతో గ్లోబల్ టాయ్ రీటైల్ ఇండస్ట్రీలో ఆధిపత్యం చూపించనుంది రిలయెన్స్ బ్రాండ్స్.

Read this: PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

Reliance Brands Limited, british toy retailer HAMLEYS, Reliance Industries, C Banner International Holdings, Hamleys Global Holdings Limited, Hamleys toys, reliance hamleys deal, reliance retail buys hamleys, hamleys toys history, రిలయెన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, బ్రిటీష్ టాయ్ రీటైలర్ హామ్లేస్, రిలయెన్స్ ఇండస్ట్రీస్, హామ్లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్, హామ్లేస్ టాయ్స్, రిలయెన్స్ హామ్లేస్ డీల్, హామ్లేస్ టాయ్స్ చరిత్ర
హామ్లేస్ స్టోర్


కొన్నేళ్లుగా భారతదేశంలో హామ్లేస్ బ్రాండ్‌తో టాయ్ రిటైలింగ్‌లో లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించింది రిలయెన్స్ బ్రాండ్స్. ఐకానిక్ బ్రాండ్ అయిన హామ్లేస్‌ను సొంతం చేసుకోవడం ద్వారా గ్లోబల్ రిటైల్‌లో రిలయెన్స్ ముందు వరుసలో నిలిచింది. చాలాకాలంగా కంటున్న కల నిజమైంది.


దర్శన్ మెహ్తా, ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, రిలయెన్స్ బ్రాండ్స్


హామ్లేస్ 1881లో రెజెంట్ స్ట్రీట్ లండన్ స్టోర్‌ని ప్రారంభించింది. ఏడు అంతస్తుల్లో 54,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50,000 పైగా టాయ్స్‌తో ఫ్లాగ్‌షిప్ స్టోర్ ఏర్పాటు చేయడం విశేషం. లండన్ లోని టూరిస్ట్ అట్రాక్షన్లల్లో ఒకటిగా నిలిచింది ఆ టాయ్ స్టోర్. ఏటా 50 లక్షల మంది కస్టమర్లు వస్తుంటారు. ప్రపంచంలోని వేర్వేరు దేశాలకు చెందిన పిల్లలు, యువత ఈ స్టోర్‌ను సందర్శించడం విశేషం.

Read this: WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే
Loading...
Reliance Brands Limited, british toy retailer HAMLEYS, Reliance Industries, C Banner International Holdings, Hamleys Global Holdings Limited, Hamleys toys, reliance hamleys deal, reliance retail buys hamleys, hamleys toys history, రిలయెన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, బ్రిటీష్ టాయ్ రీటైలర్ హామ్లేస్, రిలయెన్స్ ఇండస్ట్రీస్, హామ్లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్, హామ్లేస్ టాయ్స్, రిలయెన్స్ హామ్లేస్ డీల్, హామ్లేస్ టాయ్స్ చరిత్ర
హామ్లేస్ స్టోర్


రిలయెన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌లో భాగం. అర్మానీ ఎక్స్‌ఛేంజ్, బాటీ, బొట్టెగా వెనెటా, బ్రూక్స్ బ్రదర్స్, బర్బెర్రీ, కనాలీ, కోచ్, డీసీ, డీజిల్, డ్యూన్, ఎంపోరియా అర్మానీ, ఎర్మెనిగిల్డో జెంగా, జీ స్టార్ రా, గ్యాస్, జియార్జియో అర్మానీ, హామ్లేస్, హ్యుగో బాస్, హుకేమొల్లర్, ఐకానిక్స్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్ న్యూ యార్క్, కర్ట్ జీగర్, మైఖేల్ కోర్స్, మదర్ కేర్, మ్యూజీ, పాల్ అండ్ షార్క్, పాల్ స్మిత్, పాటరీ బార్న్, పాటరీ బార్న్ కిడ్స్, క్విక్ సిల్వర్, రీప్లే, రోక్సీ, సాల్వాటోర్ ఫెర్రాగామో, సత్య పాల్, స్టీవ్ మాడెన్, సూపర్ డ్రై, స్కాచ్ అండ్ సోడా, థామస్ పింక్, ట్యూమీ, విల్లెరాయ్ అండ్ బోచ్, వెస్ట్ ఎల్మ్ లాంటి బ్రాండ్స్‌‌తో రిలయెన్స్ బ్రాండ్స్ లిమిటెడ్‌కు ఒప్పందాలున్నాయి.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసిన గూగుల్... ఫీచర్స్ ఇవే
First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...