ఇటలీకి చెందిన సునినో గ్రూప్‌కి చెందిన ప్లాస్టిక్ లెగ్నో స్పాతో (Plastic Legno SPA) రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL) జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో ప్లాస్టిక్ లెగ్నో స్పా టాయ్స్ తయారు చేసే వ్యాపారంలో 40 శాతం వాటాలు సొంతం చేసుకుంది. ఈ పెట్టుబడి రెండు సంస్థలకు ఉపయోగపడుతుంది. ఈ డీల్ ఆర్‌బీఎల్ టాయ్ బిజినెస్ పెంచుకోవడానికి, భారతదేశంలో బొమ్మల తయారీ రంగంలో సప్లై చెయన్ విస్తరించడానికి సహాయపడుతుంది. యూరోప్‌లో 25 సంవత్సరాలకు పైగా బొమ్మల తయారీ అనుభవాన్ని కలిగి ఉన్న సునినో గ్రూప్‌కు చెందిన కంపెనీ ప్లాస్టిక్ లెగ్నో స్పా.
సునినో గ్రూప్ 2009లో భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించింది. గ్లోబల్ మార్కెట్లకు ముఖ్యంగా భారతదేశంలో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న డిమాండ్‌ను తీర్చడం కోసం భారతదేశంలో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
India Post: ఆ అకౌంట్ ఉన్నవారికి ఇండియా పోస్ట్ షాక్... వడ్డీ రేటు తగ్గింది
RBL తన పోర్ట్‌ఫోలియోలో బ్రిటీష్ టాయ్ రీటైలర్ హామ్లేస్, స్వదేశీ బొమ్మల తయారీ బ్రాండ్ అయిన రోవాన్‌తో టాయ్ పరిశ్రమలో బలమైన స్థానం కలిగి ఉంది. ప్రధాన డిస్ట్రిబ్యూటర్లలో ఆర్‌బీఎల్ ఒకటి. హామ్లేస్ ప్రస్తుతం 15 దేశాలలో 213 స్టోర్లతో విస్తరించింది. భారతదేశంలో అతిపెద్ద టాయ్ స్టోర్లలో ఒకటి.
LIC Policy: రూ.5,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ విషయానికి వస్తే ఇది రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ సబ్సిడరీ. 2007 లో ఏర్పాటైంది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సెగ్మెంట్స్‌లో లగ్జరీ నుంచి ప్రీమియం బ్రాండ్లను లాంఛ్ చేయడమే లక్ష్యం. గత ఐదేళ్లలో ఈ సంస్థ అనేక బ్రాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Reliance, Reliance retail