Home /News /business /

RELIANCE BRANDS LIMITED AND ABU JANI SANDEEP KHOSLA PARTNER TO REINFORCE THE STORIED COUTURE HOUSE BA GH

Reliance Brands Limited: రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ మరో కొత్త ఒప్పందం.. AJSK ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థలో పెట్టుబడులు

Reliance Industries:

Reliance Industries:

RBL - AJSK Deal Details | భారతదేశంలో ఫ్యాషన్‌ రంగంలో మరీ భారీ ఒప్పందం కుదిరింది. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ భారతదేశపు అగ్రశ్రేణి కోటూరియర్స్ అబు జానీ సందీప్ ఖోస్లా (AJSK)లో పెట్టుబడి పెట్టడానికి ఒక ఒప్పందం చేసుకొంది.

భారతదేశంలో ఫ్యాషన్‌ రంగంలో మరీ భారీ ఒప్పందం కుదిరింది. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL- Reliance Brands Limited) భారతదేశపు అగ్రశ్రేణి కోటూరియర్స్(వినియోగదారుల సూచనల మేరకు దుస్తులు కుట్టి విక్రయించే ఫ్యాషన్‌ డిజైనర్స్‌ సంస్థ) అబు జానీ సందీప్ ఖోస్లా (AJSK)లో పెట్టుబడి పెట్టడానికి (స్వయంగా లేదా అనుబంధ సంస్థల ద్వారా) ఒక ఒప్పందం చేసుకొంది. 51 శాతం మెజారిటీ వాటా కోసం ఒప్పంద పత్రాలపై సంతకం చేసింది. వ్యూహాత్మక భాగస్వామ్యం భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా 35 ఏళ్ల దుస్తులు కుట్టి విక్రయిస్తున్న సంస్థ (కోచర్ హౌస్) ప్రణాళికలను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ముంబైలో ఉన్న అబు జానీ, సందీప్ ఖోస్లా భారతదేశపు ప్రీమియర్ కోటురియర్స్. వీరి డిజైన్ వారసత్వం 1986లో ప్రారంభమైంది. వీరి కోచర్ లేబుల్ అబూ జానీ సందీప్ ఖోస్లా అత్యాధునిక నాణ్యత, సాంప్రదాయకంగా సొగసైన శైలికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. దివ్యమైన భారతదేశ వారసత్వ సంపద ప్రతి AJSK వస్త్రాన్ని ఆధునిక కళాఖండంగా మారుస్తుంది. మూడు దశాబ్దాలుగా వారు ఈ రంగంలో కొనసాగుతున్నారు. ఫ్యాషన్‌లో ట్రెండ్‌సెట్టర్స్‌గా నిలిచారు. మిర్రర్‌వర్క్, క్రష్డ్ కాటన్, సిల్క్, చికంకారి, ఖాదీలను కోచర్‌గా పరిచయం చేస్తూ బెస్ట్ డిజైన్స్‌తో అలరించారు.

అబు జానీ, సందీప్ ఖోస్లా (Image Credit - Guri Sekhon)


అబు జానీ సందీప్ ఖోస్లా (AJSK) లేబుల్ శ్రేష్ఠతను సూచిస్తుంది. అత్యుత్తమ వస్త్రాలు, అసమానమైన నాణ్యత, సౌందర్య ఆకర్షణను సృష్టించేందుకు అత్యంత సున్నితమైన ఎంబ్రాయిడరీలు, క్లిష్టమైన అలంకారాలతో కలిసి దుస్తులు రూపొందుతాయి. అస్థిరమైన ట్రెండ్‌ల కంటే టైమ్‌లెస్ స్టైల్‌కు ప్రాధాన్యత ఇస్తారు. రాజీపడని నాణ్యత, శాశ్వతమైన చక్కదనంపై ఏకాగ్రత వల్ల వినియోగదారులు దశాబ్దం క్రితం కొనుగోలు చేసిన దుస్తులను కూడా ఈరోజు ముఖ్యమైన ఈవెంట్‌లకు ధరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Reliance Trends: అచ్చంపేటలో రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్ ప్రారంభం... ఆఫర్స్ ఇవేలేబుల్ దాని ఎంబ్రాయిడరీల కోసం ఉత్తమ ఎంపికైంది. ఇది ట్రెండ్ ఫాలోయింగ్ లేబుల్ కంటే ట్రెండ్‌సెట్టింగ్. దుస్తులు వారి స్పర్శ, అనుభూతి కోసం ఎంతగానో ఇష్టపడతాయి. లగ్జరీ కస్టమర్ విషయానికి వస్తే అధికారిక, సందర్భం, రెడ్ కార్పెట్, పెళ్లి దుస్తులకు వీరిని ఆశ్రయిస్తారు. ఫ్యాషన్ హౌస్ అబు జానీ సందీప్ ఖోస్లా ప్రస్తుతం మరో మూడు లేబుల్‌లను కలిగి ఉంది. ASAL ద్వారా అధికారిక కార్యక్రమాలు, ఈవెంట్స్‌, వివాహ దుస్తులు, ఉమెన్స్ వేర్ లేబుల్, GULABO ద్వారా విలాసవంతమైన ప్రెట్ సెపరేట్‌లు, మహిళల దుస్తులు, MARD ద్వారా సాధారణ, అధికారిక దుస్తులను అందుబాటులోకి తెస్తున్నారు.

Reliance Trends: ఏపీలో మూడు పట్టణాల్లో రిలయన్స్ ట్రెండ్స్ ప్రారంభం... ఆఫర్స్ ఇవేప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్‌లోని అన్ని రిటైల్ కంపెనీల హోల్డింగ్ కంపెనీ)డైరెక్టర్, ఇషా అంబానీ మాట్లాడుతూ.. ‘భారతదేశపు అగ్రశ్రేణి కోటురియర్స్‌తో జట్టుకట్టడం సంతోషంగా ఉంది. చక్కటి నైపుణ్యం, పద్ధతులు, ఎంబ్రాయిడరీలు, శ్రద్ధతో భారతీయ ఫ్యాషన్‌లో అసమానమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతీయ క్రాఫ్ట్‌ను పునర్నిర్మించడానికి వారి నిబద్ధతకు బలమైన వేదికను నిర్మించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. సరికొత్త విధానంతో రూపొందించడానికి పాత తరం నుంచి ప్రేరణ పొందగలగడం వారికున్న బహుమతి. అబూ సందీప్ మూడు దశాబ్దాలుగా అసాధారణ విజయాన్ని సాధించారు. వారి ప్రతిభ ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకుంది, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌కు ప్రత్యేకమైన స్థలం దక్కింది. వారిని భారతీయ శైలికి నిజమైన అంబాసిడర్‌లుగా మార్చింది. ఈ కొత్త భాగస్వామ్యంతో.. అపురూపమైన భారతీయ కళాకారులను నిలబెట్టడానికి, ప్రపంచ వేదికపై వారి అద్భుతమైన హస్తకళను ముందుకు తీసుకురావడానికి బ్రాండ్ కట్టుబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన వాటితో పోటీపడే స్థాయిని భారతదేశానికి ఈ ఒప్పందం కల్పిస్తుంది.’ అని చెప్పారు.

Reliance Industries: గ్రీన్ ఎనర్జీలో రూ.5 లక్షలకు పైగా కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఒప్పందంఒప్పందంతో ప్రపంచ విస్తరణ
అబు సందీప్ మాట్లాడుతూ.. ‘మేము అబు జానీ సందీప్ ఖోస్లాను ప్రారంభించినప్పుడు మా లక్ష్యం స్పష్టంగా ఉంది. శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన భారతదేశం నైపుణ్యం, శైలిని ఆధునిక ప్రపంచానికి తీసుకురావాలని మేము కోరుకున్నాం. భారతీయులు మన సంస్కృతి గురించి గర్వపడాలని మేము కోరుకున్నాం. ప్రపంచ ఫ్యాషన్ ల్యాండ్‌స్కేప్‌లో అది గౌరవం పొందుతుందని భావించాం. గత 35 ఏళ్లలో ఆ పనినే చేశాం. సంప్రదాయ పద్ధతులకు మళ్లీ జీవం పోయడమే కాకుండా, ఆధునిక భారతదేశం అభిరుచులు , సంస్కృతిని ప్రతిబింబించే కొత్త వాటిని కూడా సృష్టించాం. ఇప్పుడు రిలయన్స్ బ్రాండ్‌ మద్దతుతో, ప్రపంచ విస్తరణ ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతున్నాం. RBL ప్రపంచ-స్థాయి బృందం మా బ్రాండ్‌ను గ్లోబల్ వేదికపైకి నడిపిస్తోంది. భారతీయ ఫ్యాషన్‌కు ఇది మంచి సమయం.’ అని అన్నారు.

Reliance Industries Ltd:: రిలయన్స్​ చేతికి యూకేకు చెందిన సంస్థ..100 శాతం వాటాతో.. రూ.1,000 కోట్లకు పైగా..అత్యధిక బ్రాండ్‌లకు వేదిక
అబు జానీ, సందీప్ ఖోస్లా బ్రాండ్ రూపకల్పన, సృజనాత్మక దిశలో నాయకత్వం వహిస్తారు. RBL అనేది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. 2007లో ఫ్యాషన్, జీవనశైలిలో ప్రీమియం విభాగాలకు విలాసవంతమైన గ్లోబల్ బ్రాండ్‌లను ప్రారంభించడం, నిర్మించడం ప్రారంభించింది. గత ఐదేళ్లలో RBL స్వదేశీ భారతీయ డిజైనర్ బ్రాండ్‌లను నిర్మించడంలో, నిర్వహించడంలో కూడా పెట్టుబడి పెట్టింది. బ్రాండ్ భాగస్వామ్యాల ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో అర్మానీ ఎక్స్ఛేంజ్, బల్లీ, బొట్టెగా వెనెటా, బ్రూక్స్ బ్రదర్స్, బుర్బెర్రీ, కెనాలి, కోచ్, డీజిల్, డూన్, EA7, ఎంపోరియో అర్మానీ, ఎర్మెనెగిల్డో జెగ్నా, జి-స్టార్ రా, గ్యాస్, జార్జియో అర్మానీ, హామ్‌స్లీస్ అర్మానీ ఉన్నాయి. హన్‌కెమొల్లెర్‌, ఐకానిక్స్‌, జిమ్మీ చూ, కటే స్పేడ్‌ న్యూయార్క్‌, మనిష్‌ మల్హోత్రా, మైకేల్ కోర్స్‌, మథర్‌కేర్‌, ముజి, పాల్‌ అండ్‌ షార్క్‌, పాల్‌ స్మిత్‌, పోటెరీ బార్న్‌, పోటెరీ బార్న్‌ కిడ్స్‌, రాఘవేంద్ర రాథోర్‌, రీప్లే, సల్వథోర్‌ ఫెర్రాగమో, సత్య పాల్‌, స్టీవ్‌ మడేన్‌, సూపర్‌డ్రీ, స్కాచ్ అండ్ సోడా, టిఫనీ అండ్‌ కో, టోరీ బుర్చ్, తుమీ, వెర్సేస్, విల్లెరోయ్ అండ్‌ బోచ్, వెస్ట్ ఎల్మ్ తదితర బ్రాండ్‌లు ఉన్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Reliance Industries, Reliance Trends

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు