రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), బీపీ ఫ్యూయెల్ అండ్ మొబిలిటీ జాయింట్ వెంచర్ అయిన రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (RBML) మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్‌ను ప్రారంభించింది. మహారాష్ట్రలోని నవీ ముంబైలో నావ్డే దగ్గర జియో-బీపీ మొదటి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించడం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావితం చేసిన వాతావరణంలో పనిచేస్తూ, జియో-బీపీ సంయుక్తంగా కలిసి ప్రపంచ స్థాయి మొబలిటీ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కస్టమర్లకు వేర్వేరు ఇంధన అవసరాలను తీరుస్తున్నాయి. భారతదేశంలో సరికొత్త మొబిలిటీ సొల్యూషన్స్ వైపు అడుగులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కస్టమర్లకు సాటిలేని సేవల్ని అందించడానికి జియో-బీపీ బ్రాండ్ ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం రిలయన్స్‌కు ఉన్న 1400 ఫ్యూయెల్ పంపులను జియో-బీపీ రీబ్రాండ్ చేయనుంది. రాబోయే నెలల్లో కస్టమర్లకు సరికొత్త సేవల్ని అందించనుంది. భారతదేశంలో ఫ్యూయెల్స్, మొబిలిటీ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. రాబోయే 20 ఏళ్లల్లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధనాల మార్కెట్‌గా భారతదేశం మారే అవకాశం ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. యాడిటివైజ్డ్ ఫ్యూయె్స్, ఈవీ ఛార్జింగ్, రిఫ్రెష్మెంట్స్ లాంటివన్నీ ఈ స్టేషన్ల దగ్గర లభిస్తాయి. కాలక్రమంలో తక్కువ కార్బన్ ఉత్పత్తయ్యే పరిష్కారాలను అందిచనుంది జియో-బీపీ.
Credit Card: ఫ్యూయెల్ ఆఫర్ ఉన్న క్రెడిట్ కార్డు తీసుకున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
భారతదేశం అంతటా రిలయన్స్‌కు పలు వ్యాపారాల్లో విస్తారమైన ఉనికి, లోతైన అనుభవం ఉంది. దీని ద్వారా ఇంధనాలు, మొబిలిటీలో అగ్రగామిగా మారేందుకు ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. కోట్లాది రిలయన్స్ రీటైల్, జియో, బీపీ కస్టమర్లకు ఫ్యూయెల్స్, ల్యూబ్రికెంట్స్, లో కార్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించనున్నాయి. రెగ్యులర్ ఫ్యూయెల్స్ కాకుండా దేశవ్యాప్తంగా జియో-బీపీ మొబిలిటీ స్టేషన్స్ ద్వారా యాడిటివైజ్డ్ ప్యూయెల్ను ఎలాంటి ఖర్చు లేకుండా పొందొచ్చు. ఈ ఇంధనంలో అంతర్జాతీయంగా అభివృద్ధి చేయబడిన 'యాక్టివ్' సాంకేతికత ఉంటుంది. ఇది ఇంజిన్లను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. క్లిష్టమైన ఇంజిన్ భాగాలపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది.
LIC Policy: ఈ పాలసీలో రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్
జియో-బీపీ సంయుక్తంగా కలిసి తమ మొబిలిటీ స్టేషన్ల దగ్గర ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఇతర ప్రాంతాల్లో మొబిలిటీ పాయింట్స్ ఏర్పాటు చేస్తాయి. ఈ జాయింట్ వెంచర్ భారతదేశంలో ప్రముఖ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్‌గా మారడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టేషన్ల దగ్గర వైల్డ్ బీన్ కేఫ్ ద్వారా కస్టమర్లకు రిఫ్రెష్మెంట్స్ కూడా లభిస్తాయి. ప్రతీ రోజు 24 గంటలు అందుబాటులో ఉండే ఈ షాప్‌కు రిలయన్స్ రీటైల్ అవసరమైన సరుకుల్ని, స్నాక్స్, ఇతర తినుండారాలను అందిస్తుంది. వైల్డ్ బీన్ కేఫ్‌లో సిగ్నేచర్ కాఫీతో పాటు స్థానికంగా లభించే మసాలా ఛాయ్, సమోసా, ఉప్మా, పన్నీర్ టిక్కా రోల్, చాక్లెట్ లావా కేక్ లాంటి స్నాక్స్ లభిస్తాయి.
Mahindra Offer: మహీంద్రా నుంచి దివాళీ ఆఫర్... ఆ మోడల్స్‌పై రూ.81,500 వరకు డిస్కౌంట్
జియో-బీపీ కలిసి ఎక్స్‌ప్రెస్ ఆయిల్ ఛేంజ్ ఔట్‌లెట్స్‌ని కూడా ఏర్పాటు చేశాయి. ఇందుకోసం క్యాస్ట్రాల్తో ఒప్పందం చేసుకున్నాయి. అక్కడ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఉచితంగా వెహికిల్ హెల్త్ చెక్ అప్, ఉచితంగా ఆయిల్ ఛేంజ్ సర్వీస్ లభిస్తుంది. ఎక్స్‌ప్రెస్ ఆయిల్ చేంజ్ ఔట్‌లెట్స్‌లో క్యాస్ట్రాల్ లూబ్రికెంట్ కొంటే ప్రతీ టూ-వీలర్ కస్టమర్ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆయిల్ ఛేంజ్ సర్వీస్ పొందొచ్చు.
వీటితో పాటు జియో-బీపీ కలిసి 'క్వాలిటీ అండ్ క్వాంటిటీ' అష్యూరెన్స్ ద్వారా ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ సేవలు లభించనున్నాయి. వారికి జియో-బీపీ స్టేషన్ల దగ్గర ఖర్చు చేసే ప్రతీ రూపాయికి పూర్తి వ్యాల్యూ పొందొచ్చు. డైనమిక్ ప్రైసింగ్, ఇన్స్టంట్ డిస్కౌంట్స్, హ్యాపీ హవర్ స్కీమ్స్, డిజిటల్ పేమెంట్స్ లాంటి సేవలు కూడా లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes, Electric Vehicle, Jio, New electric bike, Reliance