రిలయన్స్- బీపీ సరికొత్త వ్యాపారం...దేశవ్యాప్తంగా 5500 పెట్రోల్ బంకుల నిర్మాణం

Reliance-BP: రానున్న 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 5,500 పెట్రోల్‌ పంపుల ఏర్పాటు చేసేందుకు రిలయన్స్, బీపీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ వ్యాపారం సైతం ప్రారంభించి ప్రముఖ విమానయాన సంస్థలకు విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించాయి.

news18-telugu
Updated: August 6, 2019, 8:54 PM IST
రిలయన్స్- బీపీ సరికొత్త వ్యాపారం...దేశవ్యాప్తంగా 5500 పెట్రోల్ బంకుల నిర్మాణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Reliance-BP | రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అంతర్జాతీయ సంస్థ బ్రిటీష్‌ పెట్రోలియం భాగస్వామ్యంతో రానున్న 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 5,500 పెట్రోల్‌ పంపుల ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ వ్యాపారం సైతం ప్రారంభించి ప్రముఖ విమానయాన సంస్థలకు విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించాయి. కాగా ఈ ఒప్పందానికి సంబంధించిన సంయుక్త ప్రకటనను మంగళవారం ప్రకటించాయి. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న రిలయన్స్‌ బంకుల ద్వారా ఈ నూతన వ్యాపార ఒప్పందాన్ని అమలుచేయనున్నారు.  రిలయన్స్‌కు చెందిన 1,400 పెట్రోల్‌ పంపులతోపాటు విమానయాన ఇంధన వ్యాపారం కూడా జత కానుంది. అయితే ఈ సరికొత్త జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి ఏకాభిప్రాయానికి వచ్చిన అనంతరం రెండు కంపెనీలు అంగీకారం తెలిపినట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, బీపీ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డుబ్లే ఈ భాగస్వామ్య ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒప్పందంలో భాగంగా రీటైల్‌ సర్వీస్‌ స్టేషన్‌ నెట్‌వర్క్‌ను, విమాన యాన ఇంధన వ్యాపారం కూడా ఒకే సంస్థ ద్వారా నిర్వహించేందుకు అంగీకారం కుదరింది. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 30 విమానాశ్రయాల్లో ఉన్న రిలయన్స్‌ ఇంధన వ్యాపారం విస్తరించి ఉంది. అయితే కొత్త భాగస్వామ్య కంపెనీలో రిలయన్స్‌కు 51 శాతం వాటా ఉండగా, బీపీకు 49 శాతం వాటా ఉండనుంది.


First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading