Home /News /business /

RELIANCE BECAME THE COUNTRYS BEST EMPLOYER SEE WHICH INDIAN COMPANIES GOT A PLACE IN THE FORBES WORLD BEST EMPLOYER 2021 LIST MK GH

Reliance: భారత్‌లో బెస్ట్ ఎంప్లాయర్‌గా నిలిచిన రిలయన్స్ గ్రూప్.. ఫోర్బ్స్ రేటింగ్‌లో సత్తా చాటిన సంస్థ

Reliance Industries

Reliance Industries

ప్రపంచ ర్యాంకింగ్‌లో దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా దిగ్గజాలు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఆల్ఫాబెట్, డెల్ టెక్నాలజీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Reliance Industries Ltd: ఆదాయం, లాభాలు, మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ ప్రచురించిన ‘ప్రపంచ అత్యుత్తమ యజమాన్య సంస్థల ర్యాంకింగ్స్- 2021’లో (World's Best Employers) సత్తా చాటింది. ఈ జాబితాలోని భారత కార్పొరేట్లలో రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఫిలిప్స్, సనోఫీ, ఫైజర్, ఇంటెల్ వంటి 750 ప్రపంచ దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు ఉన్న మొత్తం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రిలయన్స్ (Reliance)52వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా దిగ్గజాలు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఆల్ఫాబెట్, డెల్ టెక్నాలజీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనాకు చెందిన హువావే ప్రపంచంలోని 8వ అత్యుత్తమ యజమాన్య సంస్థగా నిలిచింది.

ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-100 ర్యాంకింగ్స్‌లో ఇతర ఇండియన్ కంపెనీలు కూడా ఉన్నాయి. ICICI బ్యాంక్ 65 స్థానంలో నిలవగా, HDFC బ్యాంక్ 77, HCL టెక్నాలజీస్ 90వ స్థానాల్లో నిలిచాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 119, లార్సన్ & టూబ్రో 127వ స్థానంలో నిలిచాయి. ఇన్ఫోసిస్ 588, టాటా గ్రూప్ 746వ స్థానంలో ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 504వ స్థానంలో నిలిచింది.

Reliance Industries Ltd: బిజినెస్​లో రిలయన్స్​ ఇండస్ట్రీస్‌ హవా.. ఒకే రోజు రెండు పెద్ద ఒప్పందాలు​ కుదుర్చుకుని రికార్డు


పెద్ద ఎత్తున చేపట్టిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ కేటాయించినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. సర్వేలో భాగంగా ఉద్యోగులు తమ యజమాన్యాలకు సంబంధించిన అనేక అంశాలపై రేటింగ్ ఇచ్చారు. 58 దేశాల్లో ఉన్న ఎంఎన్‌సీ కంపెనీలు, సంస్థల్లో పనిచేస్తున్న 1,50,000 మంది ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులపై ఈ సర్వే చేశారు. ఈ సర్వే కోసం మార్కెట్ రిసెర్చ్ సంస్థ స్టాటిస్టా (Statista) సహకారం తీసుకున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

సర్వేలో పాల్గొన్న వారి నుంచి వివిధ రకాల సమాచారం సేకరించామని ఫోర్బ్స్ వెల్లడించింది. తాము పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగాల కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎంతమేరకు సిఫారసు చేస్తారో రేటింగ్ ఇవ్వాలని అడిగారు. వారు పనిచేస్తున్న రంగంలోని ఇతర సంస్థలకు కూడా రేటింగ్ అడిగారు. ఇమేజ్, ఎకనామిక్ ఫుట్‌ప్రింట్, టాలెంట్ డెవలప్‌మెంట్, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై కంపెనీలను రేట్ చేయాలని సర్వేలో పాల్గొన్నవారిని కోరారు. ఇందులో అత్యధిక స్కోర్‌ సాధించిన 750 కంపెనీలను తుది జాబితాలో చేర్చి ర్యాంకులు కేటాయించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.

Reliance AGM 2021: జియో 5జీ వచ్చేస్తోంది... కీలక ప్రకటన చేసిన ముకేష్ అంబానీ


ఆయిల్ బిజినెస్ నుంచి రిటైల్ రంగం వరకు విస్తృతమైన వ్యాపారాలు నిర్వహిస్తున్న రిలయన్స్ సంస్థ.. 2020-21లో మహమ్మారి విజృంభించిన సమయంలో దాదాపు 75,000 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఈ క్రమంలో ఉద్యోగులు రిలయన్స్ యాజమాన్యాన్ని బెస్ట్ ఎంప్లాయర్‌గా నిలిపారని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ జాబితాలో ఇతర భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. బజాజ్ 215, యాక్సిస్ బ్యాంక్ 254, ఇండియన్ బ్యాంక్ 314, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) 404, అమర రాజ గ్రూప్ 405, కోటక్ మహీంద్రా బ్యాంక్ 418, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్ ఆఫ్ బరోడా 496 ర్యాంకులు సాధించాయి.
Published by:Krishna Adithya
First published:

Tags: Reliance Industries, Reliance Jio

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు