ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం..

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (File Photo)

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పూర్తి వేతనాన్ని వదులుకున్నారు.

 • Share this:
  రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పూర్తి వేతనాన్ని వదులుకున్నారు. 2008 - 09 సంవత్సరం నుంచి ఆయన తన వార్షిక వేతనం పెంచుకోలేదు. సుమారు 12 సంవత్సరాలుగా అదే వేతనాన్ని తీసుకుంటున్నారు. అయితే, ఈ సారి దాన్ని కూడా వదులుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం రిలయన్స్ సంస్థ మీద కూడా పడింది. దీని వల్ల ప్రధానంగా హైడ్రో కార్బన్  వ్యాపారం మీద ప్రభావం పడింది. ఈ క్రమంలో పైస్థాయిలో జీతాల కోత విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ వ్యయాలను భరించాలంటే ఇది తప్పదని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

  • ముఖేష్ అంబానీ మొత్తం వేతనాలను వదులుకుంటారు

  • బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఈసీ మెంబర్లు, సీనియర్ లీడర్లకు 30 శాతం నుంచి 50 శాతం వరకు కోత ఉంటుంది

  • రూ.15 లక్షల కంటే ఎక్కువ వేతనం అందుకునే వారికి 10 శాతం కోత ఉంటుంది

  • రూ.15 లక్షల కంటే తక్కువ వేతనం అందుకునే వారికి ఎలాంటి కోత ఉండదు

  • పనితీరు ఆధారంగా ప్రతి ఏడాది తొలి త్రైమాసికంలో ఇచ్చే వార్షిక బోనస్ వాయిదా పడుతుంది.


  ‘ఆర్థిక, వ్యాపార పరిస్థితులను కంపెనీ నిశితంగా పరిశీలిస్తుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆదాయ మార్గాలను పెంచుకుంటుంది. లాక్ డౌన్ సమయం కూడా మనకు కొన్ని అవకాశాలను కల్పించింది. మన సంస్థ ఉత్పత్తి పెంచుకోవడానికి, వ్యయాన్ని తగ్గించుకోవడానికి, డిజిటలీకరణ దిశగా కొత్త మార్గాలను చూపింది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మళ్లీ వేతనాలు మామూలు స్థితికి చేరుకునేలా ప్రయత్నిద్దాం.’ అని ఉద్యోగులకు పంపిన ఓ సర్క్యులర్‌లో రిలయన్స్ యాజమాన్యం ప్రకటించింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: