రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ బీపీ ఇండియాతో కలసి సంయుక్తంగా వెంచర్ లాంచ్ చేసింది. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. గత ఏడాది ఆగస్టులో రెండు సంస్థలు జాయింట్ వెంచర్ చేపట్టాలని నిర్ణయించాయి. ఈ జాయింట్ వెంచర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 51 శాతం, బీపీ 49 శాతం వాటాను కలిగి ఉంటాయి. ఈ వాటా కోసం బీపీ రూ.7000 కోట్లు చెల్లిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ప్రస్తుతం రిలయన్స్ పెట్రోల్ పంప్స్, విమానయాన టర్బైన్ ఫ్యూయల్ నెట్ వర్క్‌లో బీపీ భాగస్వామ్యం కానుంది. జియో - బీపీ బ్రాండ్ కింద ఆపరేట్ అయ్యే ఈ జాయింట్ వెంచర్ భారత్‌లో చమురు, మొబిలిటీ మార్కెట్లో లీడర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తోంది.
21 రాష్ట్రాల్లో విస్తరించి, జియో ప్లాట్ ఫాం ద్వారా కోట్లాది మంది కస్టమర్లు ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలసి ప్రారంభించిన జాయింట్ వెంచర్ మెరుపు వేగంతో అభివృద్ధి చెందుతుందని బీపీ ఆశాభావం వ్యక్తం చేసింది. చమురు, లూబ్రికెంట్లు, రిటైల్, అడ్వాన్స్డ్ తక్కువ కార్బన్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో బీపీకి ఉన్న అంతర్జాతీయ అనుభవాన్ని అందించనుంది. వచ్చే 20 సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే చమురు వినియోగదారుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ 20 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న కార్లు ఆరు రెట్లు పెరుగుతాయని అంచనా. ప్రస్తుతం 1400 రిటైల్ సైట్స్ నెట్ వర్క్‌ను వచ్చే ఐదేళ్లలో 5500 వరకు పెంచాలని ఆర్‌బీఎంఎల్ టార్గెట్‌గా పెట్టుకుంది. దీని వల్ల నాలుగు సర్వీస్ స్టేషన్లలో ఉద్యోగుల సంఖ్య కూడా నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే, ప్రస్తుతం ఉన్న 20,000 నుంచి 80,000 వరకు పెరగనుంది. ప్రస్తుతం 30 విమానాశ్రయాలకు అందిస్తున్న సేవలను 45 ఎయిర్ పోర్టులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.