రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎం ప్రారంభమైంది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వర్చువల్ సమావేశం జరుగుతోంది. రిలయన్స్ సీఎండీ ముఖేష్ అంబానీ ముంబై నుంచి వర్చువల్ మీటింగ్‌లో షేర్ హోల్డర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ అనేది అనేక సమస్యలతో పాటు సరికొత్త అవకాశాలను కూడా సృష్టించిందని అన్నారు. ఈ కరోనా వైరస్ సమయంలోనే జియో టీమ్ జియో మీట్‌ను రిలీజ్ చేసిందని చెప్పారు. అప్పుడే 5 మిలియన్ యూజర్లు JioMeetను డౌన్ లోడ్ చేసుకున్నట్టు తెలిపారు. భారత్‌లో క్లౌడ్ ఆధారిత వీడియో కాన్ఫరెన్స్ యాప్ ఇదేనన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది రికార్డుస్థాయిలో పెర్ ఫాం చేసిందని ముఖేష్ అంబానీ చెప్పారు. 150 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన మొట్టమొదటి భారత కంపెనీగా రికార్డులకు ఎక్కిందన్నారు.
ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ప్లాట్ ఫాంలో వివిధకంపెనీలు పెట్టిన పెట్టుబడుల వివరాలను ముఖేష్ అంబానీ చదివి వినిపించారు. ఈ సందర్భంగా గూగుల్ తో జియో ఒప్పందం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. గూగుల్ సంస్థ జియోలో 7.07 శాతం షేర్ల కోసం 33,737 కోట్లు చెల్లించనున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ ఒప్పందం రెగ్యులేటరీ బోర్డు నిబంధనలకు లోబడి ఉంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Reliance, Reliance Industries, Reliance Jio, Reliance JioMart