Reliance AGM 2021 | కోవిడ్‌పై పోరాటంలో రిలయెన్స్ చేస్తున్న పోరాటం, చేస్తున్న సేవలకు ఈ రోజు మా తాత గారు ఉండి ఉంటే ఎంతో గర్వపడేవారని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. ఆయన చూడాలనుకున్న రిలయెన్స్ కుటంబం అసలైన రూపం ఇదేనన్నారు. ప్రతీ ఒక్కరికీ అవసరమైన సహాయం చేయడానికి, తమ సంస్థ తరపున దేశానికి సేవ చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రిలయెన్స్ కుటుంబంలోని సభ్యులందరికీ సెల్యూట్ చేస్తున్నామని ఇషా అంబానీ అన్నారు. రిలయెన్స్ కుటుంబ సభ్యులు దేశం కోసం మొదట, సమాజం కోసం తర్వాత పనిచేస్తున్నారన్నారు. ఆ తర్వాతే కుటుంబం కోసం, తమ కోసం ఆలోచిస్తున్నారని ఇషా అంబానీ చెప్పారు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL మరో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ కుటుంబ సభ్యుల పనితీరుతో మన దేశం ఇంధన సరఫరా చెక్కుచెదరకుండా ఉందని, డిజిటల్ కనెక్టివిటీ ప్రభావితం కాకుండా లక్షలాది మంది రోజువారీ అవసరాలు సురక్షితంగా తీర్చబడతాయన్నారు. సంస్థ ఉద్యోగులు మానవత్వానికి చేసిన సేవకు వారికి రుణపడి ఉన్నామని చెప్పారు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL 44వ సర్వ సభ్య సమావేశం కొనసాగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి కూడా వర్చువల్ మోడ్‌లో యాన్యువల్ జనరల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akash Ambani, Isha Ambani, Mukesh Ambani, Nita Ambani, Reliance, Reliance Digital, Reliance Foundation, Reliance Industries, Reliance Jio