RIL AGM: రిలయన్స్ ఏజీఎంలో ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటనలు..

RIL AGM: యావత్తు దేశం ఎదురు చూస్తున్న జియో ఫైబర్‌నెట్ సేవల వివరాలను రిలయన్స్ ఏజీఎంలో ముఖేశ్ అంబానీ వివరించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 12, 2019, 12:43 PM IST
RIL AGM: రిలయన్స్ ఏజీఎంలో ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటనలు..
ముఖేశ్ అంబానీ
 • Share this:
ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 42వ ఏజీఎం సమావేశం ప్రారంభమైంది. కొద్ది సేపటి క్రితమే ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రిలయన్స్ ఫ్యూచర్ ప్లాన్స్‌పై అంబానీ ప్రకటనలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పోర్టర్‌గా రిలయన్స్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత ఎక్కువ జీఎస్టీ కడుతున్న కంపెనీ రిలయన్స్ అని ఆయన వెల్లడించారు. గత ఏడాది రూ.67వేల కోట్లకు పైగా జీఎస్టీ చెల్లించినట్లు తెలిపారు. రిలయన్స్ ఇప్పుడు కొత్త రిలయన్స్‌గా మారుతోందని .. న్యూ ఇండియా.. న్యూ రిలయన్స్ నినాదంతో దూసుకెళ్తుందని అన్నారు. 2030 నాటికి భారత ఎకానమీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిలయన్స్ పెట్రోలియంతో బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ‘బీపీ ఆయిల్ ఇండస్ట్రీ’ చేతులు కలపబోతోందని చెప్పారు. దాని షేర్ 49 శాతం ఉంటుందని చెప్పారు. సౌదీ కంపెనీ ఆరామ్కో 20 శాతం పెట్టుబడులు పెట్టబోతోందని ముఖేశ్ అంబానీ అన్నారు.

జియో డేటా.. భారత్‌ను ప్రకాశవంతంగా మార్చేసిందని అంబానీ అన్నారు.  భారతీయులు డిజిటల్‌పై ఏటా రూ.5లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, దానిలో భాగంగా జియో రూ.3.5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని చెప్పారు.  ప్రతి నెల కోటి మంది కొత్త వినియోగదారులు జియోలో చేరుతున్నారని వెల్లడించారు. గత ఏడాది ఆగస్టు 15న జియో ఫైబర్ నెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభించామని గుర్తు చేశారు. రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరిస్తుందని ఆయన తెలిపారు. బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశామని ముఖేశ్ స్పష్టం చేశారు.  జియో ఫైబర్‌నెట్‌ ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని తెలిపారు.

జియోతో హై ఎండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయవచ్చో లైవ్‌గా చేసి చూపించారు ఇషా, ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు.  గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్, వీఆర్ తో ఇంటి వద్దే ఉండి మనకు సరిపడే దుస్తుల షాపింగ్  చేయవచ్చని తెలిపారు. జియో ఫైబర్  అత్యంత ఆధునిక సాంకేతికతతో విద్య, వినోదాన్ని అందిస్తుందని ఇషా అంబానీ వివరించారు. అనంతరం మళ్లీ మాట్లాడిన ముఖేశ్.. జియో ఫైబర్‌నెట్‌ సేవలను సెప్టెంబరు 5 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. • టారిఫ్ రేట్లు రూ.700 నుంచి రూ.10వేల వరకు ఉంటుంది.

 • రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
 • ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడొచ్చు.

 • జియో వెల్‌కమ్ ఆఫర్ కింద.. వార్షిక ప్లాన్ తీసుకునేవారికి టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నాం.

 • భారతీయుల డేటా ప్రైవసీ కోసం బ్లాక్‌చైన్ వ్యవస్థను తీసుకొస్తున్నాం.

 • అన్నింటికంటే ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌తో జత కడుతున్నాం (దీని ప్రకారం.. జియో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తే, దానికి ‘అజుర్ ప్లాట్‌ఫాం’ను మైక్రోసాఫ్ట్ అందజేయనుంది.)

 • సత్తా ఉన్న స్టార్టప్స్‌కు జియో సహకారం అందిస్తుంది. రిజిస్ట్రేషన్ త్వరలోనే ప్రారంభం కానుంది.

 • ఇక, రిలయన్స్ డిజిటల్‌లో ప్రతి 24 సెకన్లకు ఒక టీవీ, రెండు సెకన్లకు ఒక ఫోన్ అమ్మాం.

 • రిలయన్స్ రిటైల్‌లో రూ.1,30,000కోట్ల టర్నోవర్ దాటింది.

 • డిజిటల్ మీడియాలో నెట్‌వర్క్18 టాప్ ప్లేస్‌లో ఉంది. అంతేకాదు.. ఇది అతి పెద్ద నెట్‌వర్క్

 • ఇక, 2021 మార్చి 31 నాటికి జీరో డెబ్ట్ కంపెనీగా రిలయన్స్ మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  ముఖేశ్ అంబానీ వివరించారు.

ఏజీఎం సమావేశం హైలెట్స్‌ను తెలుసుకునేందుకు న్యూస్18 తెలుగును ఫాలో అవ్వండి.
First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు