Home /News /business /

Redmi Note 11T 5G: ఎట్టకేలకు భారత మార్కెట్​​లో రెడ్​మీ నోట్​ 11టీ 5జీ లాంచ్.. డిసెంబర్​ 7 నుంచి అమ్మకాలు షురూ!

Redmi Note 11T 5G: ఎట్టకేలకు భారత మార్కెట్​​లో రెడ్​మీ నోట్​ 11టీ 5జీ లాంచ్.. డిసెంబర్​ 7 నుంచి అమ్మకాలు షురూ!

Redmi Note 11T 5G

Redmi Note 11T 5G

షియోమి లవర్స్​ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెడ్​మీ నోట్​ 11టీ 5జీ (Redmi Note 11T 5G) ఎట్టకేలకు భారత్​ మార్కెట్​లోకి విడుదలైంది. దేశంలో అత్యంత శక్తివంతమైన 5జీ స్మార్ట్​ఫోన్​గా షియోమి దీన్ని పేర్కొంది.

షియోమి లవర్స్​ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెడ్​మీ నోట్​ 11టీ 5జీ (Redmi Note 11T 5G) ఎట్టకేలకు భారత్​ మార్కెట్​లోకి విడుదలైంది (launched in Indian market). దేశంలో అత్యంత శక్తివంతమైన 5జీ స్మార్ట్​ఫోన్ (5G Smartphone​)గా షియోమి దీన్ని పేర్కొంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్, మీడియాటెక్​ డైమెన్సిటీ 810 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలోని 50 ఎంపీ ప్రైమరీ కెమెరా (Primary camera) హైలెట్​గా నిలుస్తుంది. ఈ రెడ్​మీ నోట్​ 11టీ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు పరిశీలిద్దాం.

* రెడ్​మీ నోట్​ 11టీ 5జీ ధర

రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ/64జీబీ వేరియంట్ రూ.16,999, 6జీబీ/128జీబీ వేరియంట్ రూ.17,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్​ 8జీబీ/128జీబీ వేరియంట్ రూ.19,999 వద్ద లభిస్తుంది. ప్రారంభ ఆఫర్​ కింద రూ. 1000 డిస్కౌంట్​ పొందవచ్చు. ఇక, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ (ICICI bank card)తో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,000 డిస్కౌంట్​ పొందవచ్చు. ఈ ఫోన్ స్టార్‌డస్ట్ వైట్, ఆక్వామెరిన్ బ్లూ, మ్యాట్ బ్లాక్ కలర్‌ ఆప్షనల్లో అందుబాటులో ఉంటుంది. దీన్ని డిసెంబర్ 7 నుండి Mi.com, ఎంఐ స్టోర్స్, అమెజాన్​ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.

* రెడ్​మీ నోట్ 11టీ 5జీ స్పెసిఫికేషన్లు

రెడ్​మీ నోట్ 11టీ (Redmi Note 11T) కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​ గల 6.6 అంగుళాల ఎఫ్​హెచ్​డీ ఎల్​సీడీ డిస్‌ప్లే (LCD Display)తో వస్తుంది. ఇది 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతిస్తుంది. ఈ ఫోన్ 6nm మీడియా టెక్​ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. రెడ్​మీ నోట్​ 11 టీ 5జీలో ర్యామ్ బూస్టర్ ఫీచర్ కూడా ఉంది. ప్రీమియం బ్రాండ్లలోనే ఉండే ఈ ఫీచర్‌ (feature)ను షియోమి ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందించింది. దీని ద్వారా గరిష్టంగా 3 జీబీ ర్యామ్​ను పెంచుకోవచ్చు. నీరు, ధూళిని నిరోధించే IP53 ప్రొటెక్షన్​తో వస్తుంది.

ఆప్టిక్స్ (Optics)​ విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 50 ఎంపీ మెయిన్​ కెమెరాను అందించింది. మరోవైపు, 8 ఎంపీ సెకండరీ అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్‌ను జత చేసింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ (video calling)​ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా చేర్చింది. మీ ఫోటోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు యూఐ ఫిల్టర్లను కూడా అందించింది. ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, బ్లూటూత్ 5.1 సపోర్ట్, ఐఆర్ బ్లాస్టర్లను కూడా చేర్చింది. మరోవైపు, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000mAh స్ప్లిట్-బ్యాటరీని అందించింది. దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (Finger print Censor) కూడా ఉంటుంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: 5G Smartphone, Redmi, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు