Home /News /business /

Redmi Note 11T 5G: రేపే రెడ్​మీ నోట్ 11టీ 5జీ లాంచ్​.. ఈ స్మార్ట్​ఫోన్​లోని ఐదు అద్భుతమైన ఫీచర్లివే!

Redmi Note 11T 5G: రేపే రెడ్​మీ నోట్ 11టీ 5జీ లాంచ్​.. ఈ స్మార్ట్​ఫోన్​లోని ఐదు అద్భుతమైన ఫీచర్లివే!

Redmi Note 11T 5G

Redmi Note 11T 5G

చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రెడ్​మీ (Redmi) నుంచి మరో కొత్త సిరీస్ మార్కెట్​లోకి రానుంది. రెడ్​మీ 11 సిరీస్​ నుంచి రేపు రెడ్​మీ నోట్​ 11 T 5G (Redmi Note 11T 5g) స్మార్ట్​ఫోన్​ లాంచ్​ కానుంది.

చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రెడ్​మీ (Redmi) నుంచి మరో కొత్త సిరీస్ మార్కెట్​లోకి రానుంది. రెడ్​మీ 11 సిరీస్​ నుంచి రేపు రెడ్​మీ నోట్​ 11 T 5G (Redmi Note 11T 5g) స్మార్ట్​ఫోన్​ లాంచ్​ కానుంది. ఈ​ లాంచింగ్ (Launching)​ కార్యక్రమాన్ని లైవ్​లో షియోమి యూట్యూబ్​ ఛానెల్‌ (YouTube channel) ద్వారా వీక్షించవచ్చు. అయితే, వీటి అమ్మకాలు మాత్రం వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​ గత నెలలోనే రెడ్​మీ నోట్ 11 5జీ (Redmi Note 11T 5g) పేరుతో చైనాలో ప్రారంభమైంది. అయితే గ్లోబల్ మార్కెట్​లో మాత్రం పోకో ఎం4 ప్రో 5జీ రీబ్రాండ్​ వెర్షన్​గా రానుంది. ఈ స్మార్ట్​ఫోన్ (Smartphone)​ రెడ్​మీ10టీ 5జీకి కొనసాగింపుగా వస్తోంది. రెడ్​మీ తన మైక్రోసైట్​లో పేర్కొన్న ప్రకారం, దీని ఫీచర్ల (features)ను పరిశీలిద్దాం.

మీడియాటెక్​ చిప్‌సెట్

రాబోయే రెడ్​మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5g) స్మార్ట్​ఫోన్​ 6nm ఆధారిత మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్​ఓసీ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని షియోమి ప్రకటించింది. ఈ ఫోన్​లోని ర్యామ్ (RAM)​ పనితీరును పెంచుకోవడానికి ర్యామ్​ బూస్టర్ టెక్నాలజీ సపోర్ట్ ( RAM Booster technology support)​ను అందించింది. ప్రస్తుతం రియల్‌మీ, శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్లలోనే ఈ డైనమిక్​ బూస్టర్ టెక్నాలజీ (Dynamic booster technology) అందుబాటులో ఉంది. రెడ్​మీ నోట్​ 11 టీ 5జీ బేస్ వేరియంట్ 6 జీబీ ర్యామ్​ + 64 జీబీ స్టోరేజ్​ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 6 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​, 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంటుంది.

* 90 హెర్ట్జ్​ డిస్‌ప్లే

రెడ్​మీ నోట్​ 11టీ 5జీ 90Hz డిస్‌ప్లేతో వస్తుందని షియోమి ఇండియా ప్రకటించింది. కంటెంట్‌ను బట్టి రిఫ్రెష్ రేట్‌ను 60Hzకి తగ్గించవచ్చు. ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది.

* షార్ప్ కెమెరా

మైక్రోసైట్​లో పేర్కొన్న కెమెరా ఫీచర్ల (camera feature)ను బట్టి చూస్తే.. ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా గల డ్యుయల్ రియర్ కెమెరా (Dual rear camera) సెటప్‌తో వస్తుంది. దీనిలో మెయిన్​ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. దీని హోల్-పంచ్ కటౌట్ లోపల సెల్ఫీలు, వీడియో కాలింగ్ (video calling) కోసం 16- మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్ కెమెరాను చేర్చింది.

* 33 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్

ఈ స్మార్ట్​ఫోన్​ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తుంది.

* కలర్​ ఆప్షన్లు

రెడ్​మీ నోట్​ 11టీ 5జీ భారత మార్కెట్​లో మొత్తం రెండు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. ఆక్వా, సిల్వర్‌ కలర్​ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వైట్​ కలర్​లో కూడా లభించే అవకాశం ఉంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: 5G Smartphone, New feature, Redmi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు