Home /News /business /

New Smartphones: వచ్చేవారం భారత్‌లో లాంచ్ కానున్న రెడ్‌మీ, మోటొరోలా స్మార్ట్‌ఫోన్లు.. ధర, ఫీచర్ల వివరాలివే..

New Smartphones: వచ్చేవారం భారత్‌లో లాంచ్ కానున్న రెడ్‌మీ, మోటొరోలా స్మార్ట్‌ఫోన్లు.. ధర, ఫీచర్ల వివరాలివే..

new smart phones

new smart phones

మన దేశంలో వచ్చే వారం రెండు ప్రధాన సంస్థల నుంచి స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. షియోమి నుంచి రెడ్‌మీ నోట్ 11 టీ (Redmi Note 11T) ఫోన్‌తో పాటు మోటొరోలా నుంచి మరో కొత్త మోడల్ విడుదలకు సిద్ధమయ్యాయి.

భారత్‌లో పండుగ సీజన్ సందర్భంగా గత రెండు నెలల్లో స్మార్ట్‌ఫోన్ల (smart phones) విక్రయాలు భారీగా నమోదయ్యాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో సంస్థలు ప్రకటించిన ఆఫర్లను (Offers) చాలామంది వినియోగదారులు అందిపుచ్చుకున్నారు. అయితే దీపావళి తరువాత మార్కెట్ కొంత కాలం స్తబ్దుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ నెలలో ఎక్కువ మోడళ్లను లాంచ్  (launch)చేయలేదు. కానీ మన దేశంలో వచ్చే వారం రెండు ప్రధాన సంస్థల నుంచి స్మార్ట్‌ఫోన్లు (New smartphones) విడుదల కానున్నాయి. షియోమి నుంచి రెడ్‌మీ నోట్ 11 టీ (Redmi Note 11T) ఫోన్‌తో పాటు మోటొరోలా (Motorola) నుంచి మరో కొత్త మోడల్ విడుదలకు సిద్ధమయ్యాయి.

నవంబర్ 30న లాంచ్..

రెడ్‌మీ నోట్ 11 టీ (Redmi Note 11T) స్మార్ట్‌ఫోన్‌ నవంబర్ 30న భారతదేశంలో లాంచ్ కానుంది. విడుదలకు ముందే ఈ ఫోన్‌ (phone)కు సంబంధించిన కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను (Specifications) షియోమి ప్రకటించింది. నోట్ 11టీ స్మార్ట్‌ఫోన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, LCD ప్యానెల్, MIUI 12.2 అవుట్ ఆఫ్ ది బాక్స్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (fast charging support) వంటి ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

* రెడ్‌మీ నోట్ 11T ధర

రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 64GB స్టోరేజ్, 6GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 128GB స్టోరేజ్.. వంటి మూడు వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో రెడ్‌మీ నోట్ 11టీ ధర రూ.15,000 నుంచి ప్రారంభమవుతుందని అంచనా. గ్లోబల్ మార్కెట్‌ పరంగా చూస్తే, ఈ మోడల్‌ భారత్‌లోనే ముందు లాంచ్ (launch) కానుంది. షియోమి సంస్థ కొన్ని నెలల క్రితం చైనాలో రెడ్‌మీ నోట్ 11  (Red MI note 11T)సిరీస్‌ను విడుదల చేసింది.

* Moto G31

వచ్చే వారం రెడ్‌మీ నోట్ 11టీ ((Red MI note 11T)) ఫోన్‌తో పాటు మోటొరోలా నుంచి మోటో జీ31 (Moto G31) స్మార్ట్‌ఫోన్ సైతం విడుదల కానుంది. నవంబర్ 29న ఈ మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేస్తామని మోటొరోలా (Motorola) ప్రకటించింది. అయితే అంతకు ముందే కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ (leak) అయ్యాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G85 SoC చిప్‌సెట్‌, 50-మెగాపిక్సెల్ కెమెరా సెటప్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. యూరోపియన్ మార్కెట్‌లో Moto G31 ఫోన్ దర 199 యూరోలుగా ఉంది. ఈ లెక్కన భారత్‌లో దీని ధర దాదాపు రూ. 16,700గా ఉంటుంది. ఈ ఫోన్ 4GB + 64GB స్టోరేజ్ మోడల్ బేస్ వెర్షన్ ధర రూ. 15,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Motorola, Redmi, Smartphones

తదుపరి వార్తలు