హోమ్ /వార్తలు /బిజినెస్ /

Redmi 10 Prime: త్వరలోనే భారత మార్కెట్​లోకి రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

Redmi 10 Prime: త్వరలోనే భారత మార్కెట్​లోకి రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

(image: Redmi India)

(image: Redmi India)

షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ విడుదలకు సిద్దమవుతోంది. రెడ్‌మి 10 ప్రైమ్ పేరుతో అతి త్వరలోనే దీన్ని భారత మార్కెట్​లోకి లాంచ్​ చేయనుంది. తాజాగా ఈ స్మార్ట్​ఫోన్​ రిలీజ్​కు సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ డివైజ్‌ను సెప్టెంబర్ 3న, మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్​లోకి పరిచయం చేయనున్నట్లు ఈ పోస్టర్​ ద్వారా వెల్లడించింది.

ఇంకా చదవండి ...

షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ విడుదలకు సిద్దమవుతోంది. రెడ్‌మి 10 ప్రైమ్ పేరుతో అతి త్వరలోనే దీన్ని భారత మార్కెట్​లోకి లాంచ్​ చేయనుంది. తాజాగా ఈ స్మార్ట్​ఫోన్​ రిలీజ్​కు సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ డివైజ్‌ను సెప్టెంబర్ 3న, మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్​లోకి పరిచయం చేయనున్నట్లు ఈ పోస్టర్​ ద్వారా వెల్లడించింది. మోడల్ నంబర్ 21061119AG తో రెడ్​మీ 10 ప్రైమ్​ రాబోతున్నట్లు ధ్రువీకరించింది. గ్లోబల్ మార్కెట్​లోకి రెడ్​మి 10 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్​కు ఇప్పటికే బ్లూటూత్ ఎస్​ఐజీ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది.

గ్లోబల్ మార్కెట్​లో రెడ్‌మి 10 పేరుతో విడుదలైన ఇదే స్మార్ట్​ఫోన్​ను భారత్​లో రెడ్‌మి 10 ప్రైమ్‌ పేరుతో లాంచ్ చేయనున్నారు. అచ్చం రెడ్​మీ 10 ఫీచర్లనే దీనిలో అందించనున్నారు. ఇది అద్భుతమైన కెమెరా సెన్సార్, హోల్-పంచ్ డిస్‌ప్లే, మీడియాటెక్ చిప్‌సెట్​ వంటి ఫీచర్లతో రానుంది. ఈ ఫోన్‌ బ్లూ కలర్ ఫినిషింగ్‌తో రానుంది.

వేరియంట్ల ధర

గ్లోబల్ మార్కెట్లోకి విడుదలైన రెడ్‌మి 10 బేస్ వేరియంట్​ (4GB ర్యామ్​ + 64GB స్టోరేజ్ వేరియంట్) 179 డాలర్ల (సుమారు రూ. 13,300) ధర వద్ద లభిస్తుంది. 4GB ర్యామ్​ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర 199 డాలర్ల (సుమారు రూ. 14,800) వద్ద ప్రారంభమవుతుంది. 6 GB ర్యామ్​ + 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర 219 డాలర్లుగా (సుమారు రూ. 16,283) ఉంది. ఈ వేరియంట్లన్నీ పెబుల్ వైట్, కార్బన్ గ్రే, సీ బ్లూ అనే మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. అయితే భారత్​లో విడుదల కానున్న రెడ్‌మి 10 ప్రైమ్ మాత్రం ఒకే కలర్​ ఆప్షన్​లో లభించే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్లు (అంచనా)

రెడ్‌మి 10 ప్రైమ్, రెడ్‌మి 10 రెండూ ఒకే రకమైన స్పెసిఫికేషన్లతో వచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్​లో విడుదలైన రెడ్‌మి 10 స్మార్ట్​ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది​ 6.5 అంగుళాల ఫుల్-హెచ్‌డి+ అడాప్టివ్ సింక్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. దీనిలో 6 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ అందించింది. ఇది మీడియాటెక్ హీలియో జి 88 ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ డివైజ్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా చేర్చింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, ఫోటోగ్రఫీ, డెప్త్ సెన్సింగ్ కోసం రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్ల కెమెరాలను రెడ్‌మి చేర్చింది.


దీని ముందు భాగంలో, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ కెమెరాను చేర్చింది. రెడ్‌మి 10లో 18W ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000mAh బ్యాటరీని అందించింది.

First published:

Tags: Redmi

ఉత్తమ కథలు