RECURRING DEPOSIT RD CALCULATOR HOW TO CALCULATE INTEREST RATE ON RD ACCOUNT MK
రోజుకు రూ.100 జమ చేస్తే చాలు...అక్షరాలా 1 లక్షా 40 వేల రూపాయల లాభం...ఎలాగంటే...
(ప్రతీకాత్మక చిత్రం)
5 లక్షల డిపాజిట్ కోసం మీరు 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా 3000 రూపాయలు డిపాజిట్ చేయాలి. వడ్డీ రేటు ఇంకా 5.8 శాతంగా లెక్కవేస్తే. ఇక్కడ మీరు మొత్తం 3.60 లక్షల పెట్టుబడిపై 1.40 లక్షల రూపాయల అదనపు వడ్డీని పొందుతారు. ఈ లెక్కన రోజుకు 100 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది.
కరోనా నేపథ్యంలో పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో వినియోగ దారులు తమ డబ్బును దాచుకునేందుకు రకరకాల మార్గాలను వెతుకుతున్నారు. అయితే తాజాగా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా మంచి వడ్డీ రేటు అందిస్తున్న ప్రభుత్వ హామీ పథకంగా పేరొందింది. ఈ పథకం పెట్టుబడిదారులకు పరంగా రాబడి హామీని ఇస్తున్నారు. ఎందుకంటే దీనికి ఈక్విటీ మార్కెట్ తో ఎలాంటి సంబంధం లేదు. దీంతో రిస్క్ చాలా తక్కువ. RDపై 5.8% మధ్య వడ్డీని పొందవచ్చు. రికరింగ్ డిపాజిట్ ఖాతాను పోస్టాఫీసులో తెరవచ్చు. RD కూడా FD మాదిరిగానే మంచి పొదుపు ఎంపిక. ఎఫ్డిలో ఒకేసారి మొత్తాన్ని పొదుపు చేయాలి. RDలో, మీరు SIP తరహాలోనే నెలవారీ ప్రాతిపదికన పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో, త్రైమాసిక ప్రాతిపదికన మీ ఖాతాలో వడ్డీ పెరుగుతుంది.
RD ఎంత కాలవ్యవధి ఉంటే అంత లాభం పెరుగుతుంది. అందువల్ల, దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఆర్డీగా ఉంచాలి. పోస్టాఫీసు ఆర్డీపై వడ్డీ 5.8 శాతం లభిస్తుంది. చాలా బ్యాంకులు దీని కంటే తక్కువ వడ్డీని అందిస్తున్నాయి. RD పథకంలో మీరు నెలకు కనీసం 100 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు దీని కంటే ఎక్కువ మొత్తం కూడా జమ చేయవచ్చు. గరిష్ట డిపాజిట్ మొత్తానికి పరిమితి లేదు.
5 లక్షల డిపాజిట్ కోసం ఇలా చేయండి...
5 లక్షల డిపాజిట్ కోసం మీరు 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా 3000 రూపాయలు డిపాజిట్ చేయాలి. వడ్డీ రేటు ఇంకా 5.8 శాతంగా లెక్కవేస్తే. ఇక్కడ మీరు మొత్తం 3.60 లక్షల పెట్టుబడిపై 1.40 లక్షల రూపాయల అదనపు వడ్డీని పొందుతారు. ఈ లెక్కన రోజుకు 100 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది.
ఏ వ్యక్తి పేరు మీద అయినా RD ఖాతా తెరవవచ్చు. గరిష్ట సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. అవును, ఖాతా వ్యక్తిగతంగా మాత్రమే తెరవాల్సి ఉంటుంది. కుటుంబం , సంస్థల పేరిట తెరవలేరు. ఇద్దరు వయోజన వ్యక్తులు కలిసి ఉమ్మడి RD ఖాతాను తెరవగలరు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.