హోమ్ /వార్తలు /బిజినెస్ /

Recurring deposit: రికరింగ్​ డిపాజిట్లపై 8.5% వడ్డీ అందిస్తున్న స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంకులు.. వీటిపై ఓ లుక్కేయండి

Recurring deposit: రికరింగ్​ డిపాజిట్లపై 8.5% వడ్డీ అందిస్తున్న స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంకులు.. వీటిపై ఓ లుక్కేయండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

రికరింగ్​ డిపాజిట్లలో కస్టమర్ వాయిదాల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. చిన్న మొత్తాలను పొదుపు చేసే వారికి ఈ ఆర్​డీలు సౌకర్యవంతంగా ఉ

భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు దాచుకునేందుకు చాలా మంది ఫిక్స్​డ్​ డిపాజిట్లలో పొదుపు చేస్తుంటారు. అయితే, దీనిలో వచ్చే వడ్డీ కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్లే, మరో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గమైన రికరింగ్​ డిపాజిట్ల(ఆర్​డీ)పై ఇప్పుడు అందరి చూపు పడింది. రికరింగ్​ డిపాజిట్లలో కస్టమర్ వాయిదాల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. చిన్న మొత్తాలను పొదుపు చేసే వారికి ఈ ఆర్​డీలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతినెలా కేవలం రూ. 100 పెట్టుబడితోనే దీన్ని ప్రారంభించవచ్చు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ), హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు రికరింగ్​ డిపాజిట్​ ఖాతా తెరవడానికి అవకాశం ఇస్తున్నాయి.ఈ బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌బి)ల్లో కూడా ఆర్డీ ఖాతాలను తెరవవచ్చు. ఆ బ్యాంకుల్లో అమలు చేస్తున్న వడ్డీ రేట్లను పరిశీలిద్దాం.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24 నుంచి 36 నెలల కాలవ్యవధి గల రికరింగ్​ డిపాజిట్లపై అత్యధికంగా 8% వడ్డీ అందిస్తుంది. 12, 15, 18, 21, 24 నెలలకు ఈ బ్యాంక్ 7.25% వడ్డీరేటు అమలు చేస్తుంది. అంతేకాక, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు కూడా ఇదే వడ్డీ అందిస్తోంది. ఎఫ్‌డి మాదిరిగానే, సీనియర్ సిటిజన్లు అదనంగా 0.5% ఎక్కువ వడ్డీ పొందవచ్చు. వారు 24 నుంచి 36 నెలల కాల వ్యవధి గల ఆర్​డీలపై పెట్టుబడి పెడితే 8.5% వడ్డీ లభిస్తుంది. కాగా, ఈ తాజా వడ్డీ రేట్లు 2020 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 36 నెలల నుంచి 60 నెలల మధ్య కాలపరిమితి గల ఆర్​డీలపై అత్యధికంగా 7.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఇదే వ్యవధిలో సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ రేటు అమలు చేస్తోంది. నెల నుండి- 6 నెలలు వరకు 4%, 6 నెలల నుంచి 12 నెలల వరకు 6%, 12 నెలల నుంచి 36 నెలల వరకు 7%, 36 నెలల నుంచి 60 నెలల వరకు 7.25%, 60 నెలల నుంచి 120 నెలల వరకు 6.50% వడ్డీ రేట్లను అమలు చేస్తుంది.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐదేళ్ల కాలపరిమితి గల ఆర్టీపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ సమయానికి సాధారణ కస్టమర్లకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ రేట్లు అమలు చేస్తుంది. 6 నెలలకు 5.50%, 9 నెలలకు 6.00%, 12 నుంచి 24 నెలల వరకు 6.75%, 27 నెలల నుంచి 36 నెలల వరకు 7.00% వడ్డీ రేటు, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 7.10%, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 6.50% వడ్డీ రేట్లు అమలు చేస్తోంది.


నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండేళ్ల ఆర్డీపై అత్యధికంగా 7.50% రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంక్ అదనంగా 0.5 వడ్డీ అందిస్తుంది. ఈ రేట్లు 2021 సెప్టెంబర్ 1 నుంచి అమల్లో ఉంటాయి. 3 నెలలకు 4.25%, 6 నెలలకు 4.50%, 9 నెలల నుంచి ఏడాదికి 5.50%, రెండేళ్లకు 7.50%, మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు 7.00%, ఐదేళ్ల నుంచి పదేళ్లకు 6.50% వడ్డీ రేట్లను అమలు చేస్తోంది.

First published:

Tags: Business, Recurring Deposits

ఉత్తమ కథలు