హోమ్ /వార్తలు /బిజినెస్ /

Auto Sales: అబ్బబ్బబ్బ ఏం కొనేశారండి బాబూ.. దసరాకు దుమ్ములేపారు!

Auto Sales: అబ్బబ్బబ్బ ఏం కొనేశారండి బాబూ.. దసరాకు దుమ్ములేపారు!

అబ్బబ్బబ్బ ఏం కొనేశారండి బాబూ.. దసరాకు దుమ్ములేపారు!

అబ్బబ్బబ్బ ఏం కొనేశారండి బాబూ.. దసరాకు దుమ్ములేపారు!

Vehicle Sales | నవరాత్రుల సందర్భంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ టాప్ గేర్‌లో దూసుకుపోయింది. తాజా ఫెస్టివల్ సీజన్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) సోమవారం వెల్లడించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Car Sales | దసరా పండుగకు ముందు ప్రారంభమయ్యే నవరాత్రులను భారతీయులు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అందుకే కొత్తగా చేయాల్సిన పనులను ఈ రోజుల్లోనే ప్రారంభిస్తారు. ముఖ్యంగా కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ సీజన్‌ అనువైనదిగా భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను ట్రేడ్ వర్గాలు కూడా అర్థం చేసుకొని స్పెషల్ ఆఫర్లను (Festive Offers) అందిస్తుంటాయి. అయితే ఈ నవరాత్రుల సందర్భంగా ఆటోమొబైల్ (Automobile) ఇండస్ట్రీ టాప్ గేర్‌లో దూసుకుపోయింది. తాజా ఫెస్టివల్ సీజన్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) సోమవారం వెల్లడించింది.

ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో దేశంలో వాహనాల రిటైల్ అమ్మకాలు 57 శాతం పెరిగాయని FADA తెలిపింది. ఈ సమయంలో ఏకంగా దాదాపు 5.4 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని పేర్కొంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 మధ్య మొత్తం వాహన రిటైల్ అమ్మకాలు 5,39,227 యూనిట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం నవరాత్రి సమయంలో 3,42,459 యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా, ఈసారి సేల్స్ భారీగా పెరిగాయి. మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత కస్టమర్లు తిరిగి వాహనాల కొనుగోళ్లపై మునుపటి ధోరణి అవలంభిస్తున్నారని FADA ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ట్రెండ్ దీపావళి వరకు కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫెస్టివల్ సీజన్ సెంటిమెంట్ కూడా సేల్స్ పెరగడానికి దోహదం చేసిందని చెప్పారు.

ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. వారికి అదిరిపోయే శుభవార్త

ఈ సంవత్సరం ఆటోమొబైల్ ఇండస్ట్రీ సేల్స్‌, పరిశ్రమ మొత్తానికి కూడా రికార్డుగా నిలిచాయి. 2019 నవరాత్రిలో 4,66,128 యూనిట్ల అమ్మకాలు ఇప్పటి వరకు టాప్‌గా ఉండగా, ఈసారి రికార్డు బ్రేక్ అయింది. FADA డేటా ప్రకారం, గత ఏడాది పండుగ సీజన్‌లో టూవీలర్ రిటైల్ సేల్స్ 2,42,213 యూనిట్లకు పరిమితం కాగా, ఈ సంవత్సరం నవరాత్రి అమ్మకాల్లో మొత్తం టూవీలర్ సేల్స్ 3,69,020 యూనిట్లకు పెరిగాయి. అంటే ఏడాది అమ్మకాల్లో 52.35 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గతంలో కోవిడ్ పరిస్థితుల ముందు, 2019 నవరాత్రి టైమ్‌లో బైక్ సేల్స్ 3,55,851 యూనిట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా, ఆ లెక్కలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 3.7 శాతం పెరిగాయి. అయితే కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే.. టూవీలర్ సేల్స్ అనుకున్నంత వృద్ధి కనబర్చలేదని సింఘానియా చెప్పారు.

ఈరోజు నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్‌బీఐ!

వాణిజ్య వాహనాల రిటైల్ అమ్మకాలు గత ఏడాది నవరాత్రిలో 15,135 యూనిట్లకు పరిమితం కాగా, ఈసారి 48.25 శాతం పెరిగి 22,437 యూనిట్లకు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది నవరాత్రి సమయంలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 1,10,521 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది 64,850 యూనిట్లుగా ఉంది. అంటే ఈ ఏడాది సేల్స్‌లో 70.43 శాతం వృద్ధి కనిపించింది.

ట్రాక్టర్ విక్రయాల్లో.. 2021 నవరాత్రిలో విక్రయించిన 11,062 యూనిట్లపై ఈసారి 57.66 శాతం పెరిగి, 17,440 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్ కేటగిరీలో కూడా వృద్ధి కనిపించింది. గత ఏడాది ఈ విభాగంలో నమోదైన అమ్మకాలు 9,203 యూనిట్లు కాగా, ఈ ఏడాది నవరాత్రిలో 19,809 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

First published:

Tags: Automobiles, Car sales, Dussehra 2022, Latest offers, Navaratnalu, Offers

ఉత్తమ కథలు