ఆర్థిక సంక్షోభం తీవ్రం... ఇండియాలో ఏం జరుగుతోంది?

Indian Economy : పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా... నిజానికి ఇండియా పరిస్థితి ఏం బాలేదు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుదేలవుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రస్తుత పరిస్థితి ఏంటి?

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 6:38 AM IST
ఆర్థిక సంక్షోభం తీవ్రం... ఇండియాలో ఏం జరుగుతోంది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
India Recession : ఎవరు ఔనన్నా, కాదన్నా... నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా అధికారంలోకి వచ్చాక... దేశ ఆర్థిక పరిస్థితులు మరింత పతనమవుతున్నాయి. ఐతే... దీనికి కారణం... ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావనీ... మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయాల ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయని కొందరు ఆర్థిక వేత్తలు వాదిస్తున్నారు. ప్రధానంగా... వృద్ధి రేటు 7 శాతం ఉంటుందనుకుంటే... అది కేవలం 5 శాతానికే పరిమితం అవ్వడంతో... వాస్తవ పరిస్థితులు బయటికొచ్చినట్లైంది. ప్రస్తుతం దేశం రోజురోజుకీ ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతోంది. ఉత్పత్తి, ఉపాధి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఊహల్లో బతికేస్తున్నారని కొందరు ఆర్థిక వేత్తలు విమర్శిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఉంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కూడా. ఓవైపు మాంద్యం ఉందంటూ... ఆందోళన చెందుతూనే... ఆ ప్రభావం సామాన్య ప్రజలపై పడదని చెప్పుకొస్తున్నారు. RBI నుంచీ రూ.1.76లక్షల కోట్లను కేంద్ర ఖజానాకు బదిలీ చేసినా, బ్యాంకుల్ని విలీనం చేస్తున్నా, వడ్డీ రేట్లపై రాయితీలు ప్రకటించినా ఫలితం కనిపించట్లేదు.

ప్రస్తుతం ఇండియా పరిస్థితి ఇదీ :
- ఉత్పత్తి, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు కుదేలయ్యాయి.

- పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావట్లేదు.
- బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించట్లేదు.


- మాంద్యం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం 10 నెలల గరిష్టానికి చేరింది.
- లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.- రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కేంద్రం కోతలు పెడుతోంది.
- ప్రజల దగ్గర డబ్బు లేదు. ఏది కొనాలన్నా ఆలోచించుకునే పరిస్థితి వచ్చేసింది.
- ఉపాధి అవకాశాల్ని మెరుగుపరచడంలో కేంద్రం విఫలమవ్వడం కూడా ఓ కారణం.
- అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌తో ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాలున్నా... అవేవీ వాస్తవంలో కనిపించట్లేదు.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు