హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: బడ్జెట్‌లో బేసిక్‌ ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ లిమిట్‌ ఆశిస్తున్న మధ్యతరగతి ప్రజలు.. వారి కోరికలు ఇవే..

Budget 2023: బడ్జెట్‌లో బేసిక్‌ ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ లిమిట్‌ ఆశిస్తున్న మధ్యతరగతి ప్రజలు.. వారి కోరికలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Union Budget: 2023 బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు ప్రతిఫలమిస్తుందని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తి సంవత్సర బడ్జెట్ కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

త్వరలో కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. వివిధ వర్గాల ప్రజలు తమకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు వెలువడాలని ఆశిస్తున్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitaraman) మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. ఈ మాటలు 2023 బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు(Middle Class People) ప్రతిఫలమిస్తుందని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తి సంవత్సర బడ్జెట్ కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి, సగటు పన్ను చెల్లింపుదారులు(Tax Payers) నిజంగా ఏం కోరుకుంటున్నారో తెలుసుకుందాం.

* డిడక్షన్‌ జాబితాలో అనివార్యమైన ఖర్చులు చేర్చాలి

పాత పన్ను విధానంలో ట్యాక్స్‌ ఎగ్జమ్షన్స్ ఉండేవి. సెక్షన్లు 80C, 24 కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపెయిడ్ (రూ.1.5 లక్షల వరకు), చెల్లించిన వడ్డీ (రూ.2 లక్షల వరకు)పై ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ ఉంటుంది. అద్దె వసతి గృహంలో నివసించే పన్ను చెల్లింపుదారులు యజమానుల నుంచి పొందిన హౌస్‌ రెంట్‌ అలవెన్సుపై ఎగ్జమ్షన్‌ పొందవచ్చు. అయితే కొత్త పన్ను విధానంలో ఈ ఎగ్జమ్షన్స్ తొలగించారు. ఇవి అనివార్యమైన ఖర్చులు కాబట్టి, కొత్త విధానంలో కూడా వీటిని అందించాలని కోరుతున్నారు. అలాగే 60 ఏళ్లలోపు వారు చెల్లించిన హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై సెక్షన్ 80డి కింద రూ.25,000 డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. సీనియర్‌ సిటిజన్లు రూ.50,000 వరకు ట్యాక్స్‌ డిడక్షన్‌కి అర్హులు. కొత్త పన్ను విధానం ఈ ప్రయోజనాలు అందించడం లేదు.

* ఈక్విటీ లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ లిమిట్‌ పెంపు

ప్రస్తుతం ఇండివిడ్యువల్‌ ఈక్విటీ పెట్టుబడిదారులు ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కంటే తక్కువ ఉన్న స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్టుబడి మొత్తం ఈ లిమిట్‌ కంటే ఎక్కువగా ఉంటే క్యాపిటల్‌ గెయిన్స్‌లో 10 శాతం ట్యాక్స్‌గా చెల్లించాలి. పన్ను నిపుణులు మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ.. ఈ లిమిట్‌ సరిపోదని అన్నారు. ద్రవ్యోల్బణం, ఇన్‌కం లెవల్స్‌ పెరిగాయని, ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేలా పెట్టుబడిదారులను ప్రోత్సహించడం కోసం రూ. 2.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువకు లిమిట్‌ పెంచాలని సూచిస్తున్నారు.

* బేసిక్‌ ఎగ్జమ్షన్‌, సెక్షన్ 80C లిమిట్స్‌ పెంపు

2014 బడ్జెట్‌లో రూ.2.5 లక్షల (60 ఏళ్లలోపు వ్యక్తులకు) బేసిక్‌ ఎగ్జమ్షన్‌ లిమిట్‌ పెంచారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ప్రభుత్వం ఈ లిమిట్‌ను సవరించలేదు. సెక్షన్ 80c లిమిట్‌ రూ.1.5 లక్షలు అప్పటి నుంచి అలాగే ఉంది. ఈ లిమిట్స్‌ను పెంచి మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు నిపుణులు పేర్కొన్నారు. అదే విధంగా వైద్య ఖర్చులపై పన్ను డిడక్షన్‌ను వయసు, ఇన్సూరెన్స్‌ స్టేటస్‌తో సంబంధం లేకుండా అందరికీ వర్తింపజేయాలని సూచిస్తున్నారు. టెక్ రంగంలో యువత స్టాండర్డ్ డిడక్షన్ (రూ.50,000) పెంచాలని, పన్ను రేట్లు తగ్గించాలని ఎదురుచూస్తున్నారు.

* డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై ఉపశమనం

డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అందుకునే క్యాపిటల్‌ గెయిన్స్‌పై పన్ను రేట్లను తగ్గించాలని పెట్టుబడిదారులు కోరుతున్నారు. డెట్ ఫండ్స్‌పై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై 20 శాతం, షార్ట్‌ టర్మ్‌ గెయిన్స్‌పై శ్లాబ్‌ రేటు ప్రకారం పన్ను విధిస్తున్నారు.

* సీనియర్ సిటిజన్లకు బేసిక్‌ ఎగ్జమ్షన్‌ పెంపు

సీనియర్ సిటిజన్‌లకు బేసిక్‌ ఎగ్జమ్షన్‌ లిమిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. కరోనా తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెరిగాయి. సెక్షన్ 80డి సీనియర్‌ సిటిజన్లకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై రూ.50,000 ట్యాక్స్‌ డిడక్షన్‌ అందిస్తుంది. ఈ పరిమితిని రూ.లక్షకు పెంచాలని ఆశిస్తున్నారు.

SBI: స్టేట్‌బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. మరింత భారంగా EMI.. ఆ లెక్కలివే..!

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్... బడ్జెట్‌లో కొన్ని మార్పులు

* పెన్షన్ ఇన్‌కం ట్యాక్స్‌ ఫ్రీ చేయాలి

ప్రస్తుతం పదవీ విరమణ పొందిన వారి యాన్యుటీ లేదా పెన్షన్ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ కార్పస్‌తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ పెన్షన్ పాలసీల ద్వారా కొనుగోలు చేసిన యాన్యుటీలకు వర్తిస్తుంది. పదవీ విరమణ పొందినవారు సంపాదించే మొత్తం పెన్షన్ , అసలు, వడ్డీ పై పన్ను విధిస్తారు. ట్యాక్స్‌ నెట్‌లో కనీసం ప్రిన్సిపల్‌ భాగాన్ని వదిలివేయాలనే సీనియర్ సిటిజన్‌లు కోరుతున్నారు.

First published:

Tags: Budget 2023, Union Budget 2023-24

ఉత్తమ కథలు