ఐటీ నోటీస్ వచ్చిందా? ఏం చేయాలో తెలుసా?

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 143 (1) (ఏ) కింద నోటీసులు ఇస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమయంలో ఏవైనా తప్పులు చేసినవారికి ఈ నోటీసులు వస్తుంటాయి.

news18-telugu
Updated: October 29, 2018, 3:30 PM IST
ఐటీ నోటీస్ వచ్చిందా? ఏం చేయాలో తెలుసా?
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 143 (1) (ఏ) కింద నోటీసులు ఇస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమయంలో ఏవైనా తప్పులు చేసినవారికి ఈ నోటీసులు వస్తుంటాయి.
  • Share this:
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడమంటే అదో పెద్ద సవాల్. ఇదంతా అవసరమా అని నిర్లక్ష్యం చేసేవాళ్లు కొందరైతే... తప్పదు కదా అని ఐటీ రిటర్న్స్ చేసినవాళ్లు సైతం చిక్కుల్లో పడుతుంటారు. కారణం... ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో తప్పులు చేయడమే. ఇలాంటి తప్పుల్ని తగ్గించేందుకే అధికారులు ఐటీఆర్ ఫైలింగ్ ఫామ్‌ని సరళంగా చేశారు. అయినా కొందరు ఐటీఆర్ ఫైల్ చేయడంలో తప్పులు చేశారు. అలా తప్పులు చేసినవారందరికీ సెక్షన్ 143 (1) (ఏ) కింద ఐటీ నోటీస్ వస్తోంది.

మరి మీరు కూడా ఐటీ నోటీస్ అందుకున్నారా? లేక మీకు కూడా ఆ నోటీస్ వస్తుందని భయపడుతున్నారా? అసలేంటీ ఈ సెక్షన్ 143 (1) (ఏ) నోటీస్? తెలుసుకోండి.

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 143 (1) (ఏ) కింద నోటీసులు ఇస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమయంలో ఏవైనా తప్పులు చేసినవారికి ఈ నోటీసులు వస్తుంటాయి.

ఏఏ తప్పులకు నోటీసులు తప్పవు?
ఆదాయ వివరాలు తప్పుగా చూపడం.
పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని చూపించకపోవడం.
మినహాయింపుల్ని సరిగ్గా వివరించలేకపోవడం.మీరు చూపించిన ఆదాయ వివరాలు, ఐటీ శాఖ దగ్గరున్న వివరాలతో సరిపోలకపోవడం.
మీరు చేసుకున్న క్లెయిమ్‌లు ఫామ్ 16లో లేకపోవడం.
ఒక సెక్షన్ బదులు మరో సెక్షన్‌లో క్లెయిమ్ చేసుకోవడం.

ఒకవేళ సెక్షన్ 143 (1) (ఏ) నోటీస్ వస్తే ఏం చేయాలి?
ఐటీ నోటీస్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు.
నోటీసు వచ్చిన 30 రోజుల్లోపు స్పందించాల్సి ఉంటుంది.
ఇ-ట్యాక్స్ ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇ-ప్రొసీడింగ్స్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి.
ఐటీ నోటీసులో వచ్చిన అనుమానాలకు సమాధానాలు ఇవ్వాలి.
సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
అవసరమైతే ట్యాక్స్ అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డు ఎలా వాడాలి? ఈ టిప్స్ మీకోసమే!

మీ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఇలా చేయండి!

Photos: 2018లో 20% రిటర్న్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఇవే!

Photos: షేర్ మార్కెట్‌లో రాణించాలా? ఈ సినిమాలు చూడండి!

ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఎలాంటి మెళకువలు పాటించాలో ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.
https://telugu.news18.com/tag/personal-finance/
First published: October 29, 2018, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading