news18-telugu
Updated: November 19, 2020, 2:57 PM IST
Tax on Gifts: ఖరీదైన బహుమతి వచ్చిందా? అయితే ట్యాక్స్ కట్టాలి
(ప్రతీకాత్మక చిత్రం)
పండుగలు, శుభకార్యాల్లో బహుమతులను ఇచ్చి పుచ్చుకోవడం భారతీయ సాంప్రదాయాల్లో భాగంగా ఆనవాయితీగా వస్తోంది. ప్రేమ, వేడుకకు గుర్తుగా స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రియమైన వారికి నగదు, బంగారం, వజ్రాలు, షేర్లు, భూమి తదితర ఆర్థిక బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధారణం. అయితే, మీరు స్వీకరించే కొన్ని బహుమతులపై ట్యాక్స్ వర్తిస్తుందని గుర్తించుకోండి. అన్ని గిఫ్ట్లు పన్ను రహితంగా ఉండకపోవచ్చు. పరిమితికి లోబడి ఉండే బహుమతులకే పన్ను మినహాయింపు లభిస్తుంది. అనగా, మీరు స్వీకరించే బహుమతి విలువ రూ.50,000లకు మించి ఉంటే మీరు వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, రూ.50,000 వరకు పొందిన బహుమతులపై ప్రభుత్వం ఎటువంటి పన్ను విధించదు. ఉదాహరణకు, మీరు ఆర్థిక సంవత్సరంలో రూ. 55,000 విలువైన బహుమతులను అందుకుంటే, 'ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం' కింద, మీకు పన్ను విధించబడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 (2) దీనికి అనుమతిస్తుంది.
Husband Income: భార్యలకు శుభవార్త... భర్త ఆదాయం తెలుసుకోవడం మీ హక్కుEPF Withdrawal: ఉద్యోగం మారగానే పీఎఫ్ డబ్బులు తీసుకుంటున్నారా? అయితే నష్టమే
బంధువుల నుండి స్వీకరించే బహుమతులపై పన్ను వర్తిస్తుందా?
బంధువుల నుండి అందుకునే ఏ బహుమతి అయినా పన్ను పరిధిలోకి రాదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం బంధువులు అనే పదాన్ని చట్ట ప్రకారం నిర్వచించారు. ఈ జాబితాలో ఒక వ్యక్తి- తన జీవిత భాగస్వామి, సోదరుడు లేదా సోదరి, జీవిత భాగస్వామి సోదరుడు లేదా సోదరి, తల్లిదండ్రులలో ఒకరి సోదరుడు లేదా సోదరి, ఆ వ్యక్తికి వారసుడు వంటి వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. పైన పేర్కొన్న వ్యక్తుల నుంచి స్వీకరించే బహుమతులపై ఎటువంటి పన్ను విధించబడదు. అయితే, స్నేహితులు 'బంధువు'ల పరిధిలోకి రారు. పరిమితికి మించి వారి నుండి అందుకున్న బహుమతులకు పన్ను విధించబడుతుందని గుర్తించుకోవాలి. దీంతో పాటు వివాహం సమయంలో అందుకున్న బహుమతులకు కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ, వ్యక్తి పుట్టినరోజు, వార్షికోత్సవం మొదలైన సందర్భాల్లో అందుకున్న బహుమతులకు మాత్రం పన్ను వసూలు చేయబడుతుంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి వారసులు ఇష్టానుసారం లేదా వారసత్వంగా పొందిన బహుమతులపై కూడా పన్ను విధించబడదు.
IRCTC Kerala Tour: కేరళ టూర్ వెళ్తారా? ఐఆర్సీటీసీ ప్యాకేజీ రూ.5,585 మాత్రమే
Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవేస్థిరాస్తి బహుమతికి పన్ను చెల్లించాలా?
స్థిరాస్తి విషయంలో చేసే బహుమతులపై స్టాంప్ డ్యూటీ వసూలు చేయబడుతుంది. అయితే, స్థిరాస్తి బహుమతి విలువ రూ. 50,000 మించి ఉంటే మాత్రమే ఈ స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది.
Published by:
Santhosh Kumar S
First published:
November 19, 2020, 2:57 PM IST