Gold Rate: మహిళలు ఎగిరి గంతేసే వార్త...బంగారం ధర త్వరలో ఊహకు అందని రేటుకు పతనం...ఎంతంటే..

Gold Rate: మహిళలు ఎగిరి గంతేసే వార్త...బంగారం ధర త్వరలో ఊహకు అందని రేటుకు పతనం...ఎంతంటే..

ప్రతీకాత్మకచిత్రం

మహిళలకు శుభవార్త బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. అటు రిటైల్ మార్కెట్లోనూ, ఇటు ఫ్యూచర్స్‌ మార్కెట్లో వరుసగా ఆరు రోజులగా ధర పతనం అవుతోంది. అటు విదేశాల్లో సైతం బులియన్ మార్కెట్ బేర్ మంటోంది.

  • Share this:
    మహిళలకు శుభవార్త బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. అటు రిటైల్ మార్కెట్లోనూ, ఇటు ఫ్యూచర్స్‌ మార్కెట్లో వరుసగా ఆరు రోజులగా ధర పతనం అవుతోంది. అటు విదేశాల్లో సైతం బులియన్ మార్కెట్ బేర్ మంటోంది. ముఖ్యంగా న్యూఢిల్లీ సరాఫా మార్కెట్లో బంగారం(24 క్యారట్స్‌) 10 గ్రాములు తాజాగా రూ. 239 నష్టపోయి రూ. 45,568కు చేరింది. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో ఎంసీఎక్స్‌లోనూ తగ్గుముఖం పట్టడంతో రూ. 46,028 వద్ద ట్రేడవుతోంది. అయితే ప్రస్తుత ధర గడిచిన 8 నెలల్లోనే కనిష్టం కావడం విశేషం. అటు అంతర్జాతీయ మార్కెట్లు అయిన న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ బంగారం 1,770 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే 2021 తొలి నెల నుంచే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత ఏడాది బంగారం ఏకంగా 25 శాతంపైగా పెరిగింది. గత ఆగస్ట్‌లో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ. 56,200ను తాకింది. కరోనా నేపథ్యంలో మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని భావించి అందులో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ప్రధానంగా కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారినపడటం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెప్పారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితుల్లో బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావిస్తారు. అటు పసిడి ధర పెరుగుతుండటంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్‌ సంస్థలు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం జోరుకు కారణమైంది. ఫలితంగా 2020లో బంగారం అత్యధికంగా రాబడి ఇచ్చింది. అయితే ఇటీవల అమ్మకాలు పెరగడంతో డీలా పడుతూ వచ్చింది. దీంతో 2021లో ఇప్పటివరకూ 8 శాతం లేదా రూ. 4,000 క్షీణించింది. వెరసి రికార్డ్‌ గరిష్టం నుంచి చూస్తే ఆరు నెలల్లో 18 శాతం(రూ. 10,000) కోల్పోయింది.

    అటు బంగారం తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో ఇటీవల యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ధరలు బలహీనపడటంతో యీల్డ్స్‌ పుంజుకుంటున్నట్లు తెలుపుతున్నారు. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడుతుండటం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలియజేశారు. యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ భారీ ఉపశమన ప్యాకేజీకి ప్రకటిస్తారు అనే నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం కంటే షేర్ మార్కెట్ ఈక్విటీలు తదితర పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలియజేశారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ విడుదల చేయడంతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్‌ డ్యూటీని 2.5% తగ్గించడం కూడా దీనికి జత కలసింది. ఫలితంగా బంగారం ధరలు రూ. 46,000 మార్క్‌ దిగువకు చేరాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధరలు మరోసారి రూ. 40 వేల దిగువకు చేరతాయిని భావిస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు