Flipkart Big Billion Days 2021: రియల్​మీ నుంచి త్వరలోనే తొలి టీవీ స్టిక్ లాంచ్..Realme TV Stick

Realme TV Stick

రియల్​మీ టీవీ స్టిక్.. 4K సపోర్ట్​తో వస్తుంది. ఇది గూగుల్​ టీవీ యూఐపై రన్ అవుతుంది. లీకైన టీజర్ చిత్రం ప్రకారం, రియల్‌మీ టీవీ స్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తుందని, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్​ను పోలి ఉంటుందని టిప్​స్టార్​ పేర్కొన్నారు.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్​ను పరిచయం చేస్తూ భారత మార్కెట్​లో దూసుకుపోతుంది. ఇప్పటికే స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో తనకంటూ స్పెషల్​ మార్కెట్​ క్రియేట్ చేసుకున్న రియల్​మీ.. ఇప్పుడు స్ట్రీమింగ్​ డివైజ్​ మార్కెట్​లోనూ రాణించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ తొలి 4కే గూగుల్​ టీవీ స్మార్ట్‌ స్టిక్​ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. రియల్‌మీ టీవీ స్టిక్ పేరుతో ఇది త్వరలోనే అమ్మకానికి రానుంది. రాబోయే పండుగ సీజన్​లో ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది తొలిసారి అమ్మకానికి రానుంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఫ్లిప్‌కార్ట్​లో దీని విక్రయాన్ని ధ్రువీకరించారు.

పేరు సూచించినట్లుగా, రియల్​మీ టీవీ స్టిక్.. 4K సపోర్ట్​తో వస్తుంది. ఇది గూగుల్​ టీవీ యూఐపై రన్ అవుతుంది. లీకైన టీజర్ చిత్రం ప్రకారం, రియల్‌మీ టీవీ స్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తుందని, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్​ను పోలి ఉంటుందని టిప్​స్టార్​ పేర్కొన్నారు. ఇది మార్కెట్​లకి విడుదలయ్యాక.. ఫైర్ టీవీ స్టిక్ 4K, షియోమి ఎంఐ టీవీ స్టిక్ వంటి ఫైర్​ స్టిక్​లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. అయితే రాబోయే రియల్‌మీ స్టిక్​కు సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

మరింత ఆలస్యం కానున్న రియల్​మీ 9 సిరీస్​..
రియల్​మీ ఇటీవల భారత మార్కెట్​లో కొత్త 8i, 8s బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు రియల్‌మి 8 సిరీస్‌లో భాగంగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్​లో చిప్​ల కొరత వేధిస్తోంది. దీంతో రియల్‌మీ 9 సిరీస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొలుత ఈ ఏడాది చివరిలోగా విడుదలవ్వాల్సిన ఈ సిరీస్​.. 2022 మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇటీవల రియల్‌మీ ప్యాడ్‌, రియల్‌మీ బుక్​ని కూడా భారత మార్కెట్​లోకి పరిచయం చేసింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్‌లో అనేక ఉత్పత్తలు లాంచ్‌ కానున్నాయి. సౌండ్‌కోర్ లైఫ్ నోట్ E TWS, MSI i5 గేమింగ్ ల్యాప్‌టాప్, బౌల్ట్ ఆడియో సౌండ్‌పాడ్స్, నాయిస్ క్యాన్సలేషన్​ ఇయర్‌బడ్స్​, ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్ వంటి కొత్త ఉత్పత్తులు ఈ సేల్​లో విక్రయానికి రానున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఆడియో ఉత్పత్తులు, స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి.
Published by:Krishna Adithya
First published: