Realme Days sale: రియల్ మీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీగా ఆఫర్లు.. 28 వరకే ఛాన్స్.. వివరాలివే

రియల్ మీ మొబైల్, ఇతర వస్తువులను కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ సంస్థ తాజాగా ‘రియల్ మీ డేస్’ను ప్రకటించింది. ఆ రోజుల్లో షాపింగ్ చేస్తే భారీగా డిస్కంట్లు, క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.

news18-telugu
Updated: November 25, 2020, 9:21 PM IST
Realme Days sale: రియల్ మీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీగా ఆఫర్లు.. 28 వరకే ఛాన్స్.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రియల్ మీ మొబైల్, ఇతర వస్తువులను కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ సంస్థ తాజాగా ‘రియల్ మీ డేస్’ను ప్రకటించింది. ఆ రోజుల్లో షాపింగ్ చేస్తే భారీగా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసే వారికి రూ. 50 నుంచి రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నారు. స్మార్ట్ ఫోన్స్, ఇయర్ బడ్స్, టెలివిజన్ ఇతర వస్తువులను ఈ సేల్ లో అందుబాటులో ఉంచారు. ఈ వస్తువులపై రూ. 800 నుంచి రూ. 7 వేల వరకు డిస్కౌంట్లను అందించనున్నారు. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా నవంబర్ 28న ముగియనుంది. కొన్ని వస్తువులపై ఈ నెల 30 వరకు ఆఫర్లు కొనసాగుతాయి. రియల్ మీ అధికారిక వెబ్ సైట్లో ఈ వస్తువులను కొనుగోలు చేయొచ్చు.

Realme Narzo 20 Proపై రూ. వేయి తగ్గింపు

కొన్ని వారాల క్రితం ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ అసలు ధర రూ. 14,999 కాగా.. రియల్ మీ డేస్ సేల్ లో రూ. 13,999 కే అందించనున్నారు.
Realme 6పై రూ. 1000 డిస్కౌంట్
రియల్ మీ 6 ఫోన్ ను మార్కెట్లోకి ఈ మార్చిలో విడుదల చేశారు. అయితే ఈ ఫోన్ అసలు ధర రూ. 14,999 కాగా.. ప్రస్తుతం ఆఫర్ పై రూ. 13,999కే అందిస్తున్నారు.
Realme 6iపై డిస్కౌంట్..
ఈ సేల్ లో రియల్ మీ6ఐ ఫోన్ పై మంచి డిస్కౌంట్ అందిస్తున్నారు. రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్ పై రూ. వేయి డిస్కౌంట్ అందుకునే అవకాశం ఏర్పడింది.

Realme Buds Air Neoపై రూ.800 తగ్గింపు..
ఈ ఇయర్ బడ్స్ పై భారీ తగ్గింపును అందిస్తున్నారు. ఈ సేల్ లో రూ. 2999 విలువైన ఇయర్ బడ్స్ ను రూ.2,199కే దక్కించుకోవచ్చు. వైట్, గ్రీన్ రెండు కలర్లలో ఈ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి.
Realme Watchపై రూ. వేయి తగ్గింపు..
ఈ వాచ్ అసలు ధర రూ.3999 కాగా ప్రస్తుతం ఆపర్ పై రూ. 2999 కే దక్కించుకోవచ్చు. ఈ వాచ్ పై ప్రస్తుతం రూ. వేయి తగ్గింపు లభించనుంది. ఇంకా అనేక రకాల స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై మంచి ఆఫర్లను అందిస్తున్నారు.
Published by: Nikhil Kumar S
First published: November 25, 2020, 9:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading