Home /News /business /

REAL ESTATE DEVELOPERS ARE SHOWERING DISCOUNT SHOULD AN INVESTOR GO FOR IT MK GH

Real Estateలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

కొనుగోలు దార్లను ఆకర్షించేందుకు చాలామంది రియల్ ఎస్టేటు డెవలపర్లు నగదు తగ్గింపులు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు, పార్కింగ్ ఫీజుల కోసం సున్నా ఛార్జీలు నుంచి డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావం ప్రతి రంగంపైనా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేటు రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. కోవిడ్-19కి ముందు రియల్ ఎస్టేటు రంగం అభివృద్ధి పథంలో ఉంది. అయితే మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత రియల్ ఎస్టేటు అదఃపాతాళానికి కూరుకుపోయింది. అంతేకాకుండా నిరుద్యోగిత, పెరుగుతున్న అనిశ్చితి పరిణామాల వల్ల చాలామంది కొనుగోళ్లపై దృష్టి సారించకుండా డబ్బు ఆదా చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేటు డెవలపర్లు వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ఇస్తున్నారు.

రాయితీలు కూడా ఇస్తున్నారు..
ఈ నేపథ్యంలో కొనుగోలు దార్లను ఆకర్షించేందుకు చాలామంది రియల్ ఎస్టేటు డెవలపర్లు నగదు తగ్గింపులు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు, పార్కింగ్ ఫీజుల కోసం సున్నా ఛార్జీలు నుంచి డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. భారత్ లో శుభకరమైన సమయాల్లో ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా పండుగలకు ముందు ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేటు వ్యాపారం మందకోడిగా సాగుతోంది. ఫలితంగా వినియోగదారులను ఆకర్షించేందుకు భారత్ లో డెవలపర్లు అనేక ఆఫర్లను అందిస్తున్నారు.

స్టాంప్ డ్యూటీ తగ్గించారు..
ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు 3 శాతం, 2021 జనవరి నుంచి మార్చి వరకు 2 శాతం స్టాంప్ డ్యూటీని తగ్గించింది. స్టాంప్ డ్యూటీ ఒక రాష్ట్రం నుంచి మరోక రాష్ట్రానికి మారుతుంటుంది. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రార్ కు చెల్లించే రాష్ట్ర లెవీని సూచిస్తుంది. ఈ లెవీ ఫిక్సెడ్ పర్సేంటేజీతో ఉంటుంది. లావాదేవి విలువ లేదా, సర్కిల్ రేటు ఆధారంగా ఈ లెవీ మారుతుంది. కొనుగోళ్ల సమయంలో కొనుగోలుదారులు స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఈ-స్టాంపింగ్ ఛార్జీలు, ఫ్రాంకింగ్ ఛార్జీలను చెల్లించాలి. ఈ ఛార్జీలు ఎంతో ఖరీదైనవి. ఆస్తి బిల్లుతో కాకుండా వీటిని కొనుగోలుదారులు భరించాల్సి ఉంటుంది.

నిర్మాణంలో ఉన్న ఇళ్లపై ఆసక్తి..
ప్రస్తుతం ఎక్కువ విక్రయాలు 'రెడీ టూ మూవ్'(వెళ్లేందుకు సిద్ధంగా) రీతిలో కొనుగోలు చేయగానే ఇళ్లల్లోకే వెళ్లే విధంగా ఉన్నాయి. ఫలితంగా చాలా వరకు నిర్మాణంలో ఉన్న ఇళ్లకే ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారు. ఎందుకంటే తర్వాత వచ్చే రిస్కులను తగ్గించేందుకు ఈ విధంగా చేస్తున్నారు. బిల్డర్లు కూడా నిర్మాణంలో ఉన్న ఇళ్లపై భారీ ఆఫర్లతో పాటు మంచి డిస్కౌంట్లను ప్రకటిస్తూ వీలైనంత త్వరగా వాటిని విక్రయించేందుకు చూస్తున్నారు.

నిర్మాణంలో ఉన్న ఇళ్ల విషయానికొస్తే గృహాల కొనుగోలు దారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొనుగోలుకు సంబంధించిన నష్టాన్ని ముందే అంచనా వేయాలి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు వారిచ్చిన ఆఫర్లు, డిస్కౌంట్లను మాత్రమే తీసుకోకుండా నిర్ణయం తీసుకోవాలి. ఆస్తి కొనుగోలుదారుల ప్రాధాన్యతలకు సరిపోలకపోతే వారు అలాంటి కొనుగోలుకు వెళ్లడంలో అర్థం లేదు. కొనుగోలు అనేది జీవితకాలం నిర్ణయం. అందువల్ల ఒప్పందం కుదుర్చుకునే ముందు ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరం.
Published by:Krishna Adithya
First published:

Tags: Real estate

తదుపరి వార్తలు