హోమ్ /వార్తలు /బిజినెస్ /

Recurring Deposit: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పోస్టాఫీస్ గుడ్ న్యూస్.. వారికి అదిరే శుభవార్త!

Recurring Deposit: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పోస్టాఫీస్ గుడ్ న్యూస్.. వారికి అదిరే శుభవార్త!

Recurring Deposit: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పోస్టాఫీస్ గుడ్ న్యూస్.. వారికి అదిరే శుభవార్త!

Recurring Deposit: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పోస్టాఫీస్ గుడ్ న్యూస్.. వారికి అదిరే శుభవార్త!

SBI | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? ప్రతి నెలా చిన్న మొత్తంలో డిపాజిట్ చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పోస్టాఫీస్ వంటివి తీపికబురు అందించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Post Office | మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీకు బ్యాంకులు తీపికబురు అందించాయి. అలాగే పోస్టాఫీస్ కూడా శుభవార్త తెచ్చింది. చిన్న మొత్తంలో ప్రతి నెలా డబ్బులు (Money) దాచుకునే వారికి ఊరట కలుగనుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) కాకుండా ప్రతి నెలా చిన్న మొత్తంలో రికరింగ్ డిపాజిట్‌లో డబ్బులు దాచుకునే వారు ఇకపై అధిక వడ్డీ రేటు పొందొచ్చు. చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎలాంటి వడ్డీ రేటును అయితే అందిస్తున్నాయో రికరింగ్ డిపాజిట్లపై కూడా అదే వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.

ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్స్‌కు రికరింగ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఎస్‌బీఐ , పీఎన్‌బీ, పోస్టాఫీస్, హెచ్‌డీఎఫ్‌సీలో ఎలాంటి వడ్డీ రేట్లు ఉన్నాయో చూద్దాం. ఎస్‌బీఐ అయితే రికరింగ్ డిపాజిట్లలో రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయడాన్ని అనుమతిస్తోంది. ఈ బ్యాంక్ ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఆర్‌డీలపై అయితే 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఆర్‌డీలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఏడాది నుంచి రెండేళ్ల వరకు టెన్యూర్ అయితే 7.3 శాతం వడ్డీ వస్తుంది.

నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నారా? 10 నిమిషాల్లో రూ.4 లక్షల లోన్ పొందండిలా!

పోస్టాఫీస్‌లో చూస్తే.. రూ. 100 నుంచి ఆర్‌డీ చేయొచ్చు. ప్రస్తుతం పోస్టాఫీస్ కస్టమర్లకు ఆర్‌డీ అకౌంట్‌పై 5.8 శాతం వడ్డీని అందిస్తోంది. ఐదేళ్ల టెన్యూర్‌తో పోస్టాఫీస్‌లో ఆర్‌డీ ఖాతా తెరవొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఈ బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల వరకు టెన్యూర్‌తో ఆర్‌డీ సేవలు అందిస్తోంది. రూ. 100 నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్టంగా 7.55 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విషయానికి వస్తే.. ఈ బ్యాంక్ కూడా కస్టమర్లకు 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందుబాటులో ఉంచింది. టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.

రైతులకు శుభవార్త.. ఈరోజే అకౌంట్లలోకి డబ్బులు, వచ్చాయో లేదో చెక్ చేసుకోండిలా!

అంతేకాకుండా బ్యాంకులు ఎప్పటి కప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. దీని వల్ల రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు మారుతాయి. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఏ టెన్యూర్‌పై ఎక్కువ వడ్డీ ఉందో చూడండి. కాగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి.

First published:

Tags: FD rates, Fixed deposits, HDFC bank, Post office, Recurring Deposits, Sbi

ఉత్తమ కథలు